ప్రాణాన్ని గడ్డిపరకలా విసిరేశాడో
ప్రాణాన్నే గడ్డిపరకలా విసిరేశారో!!
ఒక ల్యాప్‌టాప్
పోయిందో లేదో తెలియదు
కానీ
ఒక తల్లి గుండెలో
ఇరవై ఐదేళ్లు దాచుకున్న
ప్రాణం మాత్రం
ఖచ్చితంగా పోయింది.
విచారణ చేసేది విద్యార్థులా
పోలీసులా?
ఒక లేఖలో
తన శవం ఎక్కడుంటుందో
ముందే చెప్తాడా?
జరిగిందేమిటో
శవం మాత్రం కనిపించింది
శవం మెక్కడో
‘సూసైడ్ లేఖ’ చెప్తోంది!
హాస్టల్ గదిలో వేలాడిన ఆ మౌనం
ఇప్పుడు
యూనివర్సిటీ గోడలన్నిటికీ
నల్ల జెండాగా ఎగురుతోంది.
ఒక నింద
ఎంత పదునై ఉంటుందంటే
పూవుపై పడిన మంచుతట్టు కూడా
రాయిలా అనిపించేంతగా.
ఒక విద్యార్థి జీవితం
ఇంకా పూర్తిగా రాయకముందే
చింపేసిన పుస్తకంలా అయిపోయింది.
మధ్యలోనే తెగిపోయిన వాక్యంలా
అతని కలలు
డెస్క్‌పై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
ఆ అబ్బాయి మనసు
బహుశా
పగిలిన అద్దంలా అయిపోయుంటుంది
ఎవరెన్ని మాటలు మాట్లాడినా
తన ముఖమే
తనని వెక్కిరించినట్లనిపించుంటుంది
నిందలు కొన్ని మెడలో వేసినా
కనపడని ఉరితాళ్లలా ముడిపడుతుంటాయి.
బయటికి గాయమేమీ కనిపించదు
లోపల శ్వాసనే నెమ్మదిగా బిగిస్తుంటాయి.
ఒక తల్లి ఎదురు చూపు
స్టేషన్‌కు రాని రైలు కోసం
రాత్రంతా వెలిగే దీపంలా ఉంటుంది.
“నా బిడ్డ వస్తాడు” అనే ఆశ
ఇప్పుడు
తిరిగి తెరుచుకోని తలుపై
నిశ్శబ్దంగా తల కొడుతోంది.
యూనివర్సిటీ అంటే
కేవలం డిగ్రీలు పంచే భవనమే కాదు
మనసులు విరగకుండా
కాపాడాల్సిన స్థలం కూడా.
దొంగతనం జరిగిందా?
నిజమా? అబద్ధమా?
అది విచారణ చెబుతుంది.
కోట్లాది రూపాయల కొల్లగొట్టిన
బడా వ్యాపారులు
దర్జాగా విదేశీవిహారయాత్రలు
ఇక్కడేమో
ఆత్మగౌరవం కంటే
తన ప్రాణమేమీ గొప్పదే కాదంటూ
గడ్డిపరకలా విసిరేస్తున్నాడు!
పైసా పైసా కూడబెట్టుకున్న
ప్రజల ఆశల్ని దర్జాగా బ్యాంకుల్నేకొల్లగొట్టి
బోరవిడిచి సిగ్గులేకుండా
తిరుగుతున్న వాళ్ళనేమనాలి?
ఇప్పుడు
ఆ తల్లికి ఏమని చెప్పాలి?
“మీ కొడుకు నిర్దోషి”నా?
లేక
“తప్పు చేశాడు”నా?
ఏ మాట చెప్పినా
ఆమె ఒడిలోని వెలితిని మాత్రం
ఎవరు నింపగలరు?
(సెంట్రల్ యూనివర్సిటీ లో చనిపోయిన మయూక్ కుందు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని చెప్తున్న వార్తను జీర్ణించుకోలేక…)
-డా. దార్ల వెంకటేశ్వరరావు, 20.5.2026
Did he throw away his life like a blade of grass?
Or did they throw his very life away like a blade of grass?
A laptop
no one knows
whether it was really stolen or not.
But
the life that a mother
had treasured in her heart for twenty-five years
is certainly gone.
Was the inquiry conducted by students
or by the police?
Would someone, in a letter,
tell beforehand
where his corpse would be found?
What exactly happened—
only the corpse was found.
And somewhere beside it,
a “suicide note” is speaking.
That silence hanging in the hostel room
has now
risen like a black flag
across all the university walls.
How sharp an accusation can be—
even a dewdrop falling on a flower
can begin to feel like a stone.
A student’s life,
before it was fully written,
has become like a torn book.
Like a sentence broken midway,
his dreams
lie scattered across the desk.
That boy’s mind,
perhaps,
had become like a shattered mirror.
No matter how many words others spoke,
he might have felt
as though his own face
was mocking him.
Some accusations, even when unseen,
tighten around the neck
like invisible nooses.
No wound appears outside,
but inside,
they slowly choke the breath itself.
A mother’s waiting
is like a lamp that burns all night
for a train that never arrives at the station.
The hope—
“My son will come back”—
is now
silently knocking
on a door that will never open again.
A university
is not merely a building
that distributes degrees;
it is also a place
where minds must be protected
from breaking apart.
Did a theft really happen?
Is it true? Is it false?
The investigation will tell.
Those wealthy businessmen
who looted crores of rupees
travel abroad in grandeur.
But here,
thinking that his life
is worth less than his self-respect,
he throws it away like a blade of grass!
And what should we call those
who shamelessly roam free
after looting banks built
with the hard-earned hopes of the people,
paisa by paisa?
Now,
what can anyone say to that mother?
“Your son was innocent”?
Or
“He made a mistake”?
Whatever words are spoken,
who can ever fill
the emptiness
in her lap?
(Unable to digest the news saying that Mayookh Kundu, who died in the Central University, died by suicide…)
— Dr. Darla Venkateswara Rao, 20.5.2026
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి