"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

08 మే, 2026

ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం 2026

 ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం 2026


మనుల గావగ మహిమతో మంచి తలపు

ధరణి వెలసెను ధర్మము ధన్య మగుచు

అమల శాంతిని అందము అమర జేయు

వంద నములిడు వారికి వరుస గాను.


వ్యాధి పీడిత వారల వాసి తోడ

ప్రేమ తోడను పిలిచెను పేర్మి నపుడు

ఆదు కొనుటకు అందము ఆశ నిచ్చి

మేలు నిచ్చును మహిమతో మేటి గాను.


అమల శాంతిని అందము అమర జేయు

త్యాగ శీలిగ తరణిని తనరు నెపుడు

నమ్మ కమ్మున నయమున నాణ్య ముగను

కీర్తి నొందును కరుణతో కీర్త నీయ.


మాన వత్వము మహిమతో మంచి తలపు

ధరణి వెలసెను ధర్మము ధన్య మగుచు

ఆప దందున అండగా అరుగు దెంచు

శాంతి దూతగ సమయము చాటి చెప్పు.



వీర కృత్యము వెలయగా విమల మూర్తి

దీన జనులను దేరును దివ్య గతిని

మేలు జేయును మహిమతో మిగుల దయను

వంద నములిడు వారికి వరుస గాను.


ప్రాణ దానము పరమని పరగు చుండ

రక్త దానము రమ్యమై రాణ కెక్కు

ధన్య చరితుడు ధరణిని ధన్య మగును

ప్రణతి జేతుము పావన భావ మెరిగి.


హెన్రి డ్యూనాంటె రిగెనయ్య హెచ్చు దయను

కష్ట కాలము కలతను కాన నపుడు

నొప్పు లన్నియు నయముగ నొనర జేయు

వాపి చూపును వారధి వరుస గాను.


ఎర్ర సిలువయు ఎల్లెడ ఎనరు తోడ

జాతి భేదము జగతిని జాట నీక

మైత్రి భావన మహిమతో మాన్య గతిని

చాటు నప్పుడు శక్తిని చాడ్పు తోడ.


తోటి వారల తొనరుచు తోడ్ప డగను

చిన్న చూపును జగతిని చేర నీక

సాటి లేనట్టి సాహస సాధి తముగ

దీన జనులకు దేరును దీప్తి నొసగి.


దీన జనులను దేరును దీప్తి తోడ

కంటి పాపగ కరుణను కాన జేయు

అండ దండలు అమరగ అలరు చుండ

పరమ శాంతిని పంచియు పావ నముగ.


శ్రద్ధ తోడను సమ్మతి స్రావ్య ముగను

 వ్యాధి బాధలు వాపియు వాసి గన్న

దివ్య మూర్తులు దేజము దీప్తి నింప

వన్నె తెచ్చును విమలమై వరుస గాను.


సాటి వారల సాయము సాధ్య మవగ

అమల చిత్తము అందము అమర జేసి

భావ నందున భాగ్యము భాసు రముగ

ప్రణతి జేతుము పరమని పాలి తముగ.


ఆద రమ్మున అండగా అలరు చుండ

చక్క నైనట్టి చెలిమితో చాటు నపుడు

నమ్మ కమ్మున నయమున నాణ్య గతిని

మేలు జేయును మహిమతో మేటి గాను.


వాడి రేఖల వెలయగా వాసి కెక్కు

దీన రక్షణ దేరును దీప్తి తోడ

 ప్రేమ తోడను పిలిచెను పేర్మి నపుడు

వన్నె తెచ్చును వలనగ వాసి తోడ.


అమల శాంతిని అందము అమర జేసి

సాటి వారల సాయము సాధ్య మవగ

పరమ ధర్మము పరమని పాలి తముగ

వింత చిత్రము వెలయగ వీడు నపుడు.


కరుణ కలిగిన కమ్రత కాన వచ్చు

జాలి గుండెతో జగతిని జేర దీయు

అశ్రు ధారల అణచును అలరు తోడ

 ప్రణతు జేతుము పరమని పావ నముగ.


-డా.దార్ల వెంకటేశ్వరరావు 8.5.2026










కామెంట్‌లు లేవు: