"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

05 ఏప్రిల్, 2026

మహావీర్ జయంతి శుభాకాంక్షలు

 మహావీర్ జయంతి 


వీచు గాలియు జగమంత విస్త రించు

ఓర్చి భూమియు సకలంబు ఒప్పు నట్లు

భాను డెప్పుడు తమమును భాసి లంగ

వాన మేఘము వసుధకై వరుస గురియు

నింగి సర్వము నీడను నిశ్చ యముగ.


పూవు సౌరభ మందరి పొందు నట్లు

సర్వ జీవుల ప్రేమను సాక వలెను

శాంతి మార్గము నిరతము చారు వగుచు

వీర నాథుని కరుణను విపుల పరుచు.


నీటి ధారయు దాహము నిలుపు నట్లు

సత్య వాక్కులు లోకాన సాగ వలెను

మోహ పాశము లన్నియు ముక్తి కొరకు

వీడి వెళ్ళిన జేతను వినతి చేయు.


మట్టి లోపల మాణిక్య మహిమ లాగ

ఆత్మ జ్యోతిని వెలిగించె నపుడు విభుడు

ఆరుగురుశత్రువుల్నిల అణచి వేసి

జైను డయ్యెను జగతిలో శాశ్వతముగ.


కొండ వెలుగున దీపము కొలువు తీరి

దారి జూపుచు నుండెడి తీరు గాను

ముక్తి మార్గము జూపెను ముదము తోడ

దివ్యశక్తులుగలిగిన దివ్యుడతడు.


(5 ఏప్రిల్ 2026 మహావీర్ జయంతి సందర్భంగా)


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 


కామెంట్‌లు లేవు: