"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

21 ఏప్రిల్, 2026

జాతీయ పౌర సేవల దినోత్సవం.( 21 ఏప్రిల్)

 జాతీయ పౌర సేవల దినోత్సవం.

(21 ఏప్రిల్) 

పరమ సాహస మూర్తులు పాలనమున

ఉక్కు చట్రము వంటిది ఉర్వి యందు

రక్ష నిలుపుచు ప్రజలకు రాజ్య మందు

సేవ జేయుచు నుందురు స్థిరము గాను!


అవని నంతట శాంతిని అమర జేయ

అహము వీడియు పనులను అనుసరింతు

రాత్రి పగలనకను వారు రాజ్య పగతి

కొరకు పాటును పడుదురు కోర్కె తోడ!


అణగియున్నట్టి వర్గాల ఆదరమున

అండ దండలై నిలుచుచు అవని యందు

ప్రభుత పథకము లన్నిటి పరమ నిపుడు

చేర్చు చుందురు జనముకు చేరు!


ధర్మ మార్గము నందున ధైర్య మెసగ

ప్రజల సంక్షేమమే తమ పరమ పదము

అనుచు నెంచెడి వీరుల అంకితమును

గొప్పగా మెచ్చుదము మన కొండ వలెను!


దెసలు మెచ్చగ సేవల తెరువు నందు

కష్ట మెరిగిన వారలై గరిమ తోడ

ప్రజల సౌఖ్యమే తమదైన పరమ పదము

అనుచు నెంచెడి వీరుల అభినుతింతు!


పల్లె పల్లెకు ఏలెడి పాలనమును

చేర్చు చుందురు వీరులు చెమట నొడ్చి

అవని లోపల ప్రజలకు అండ గాను

నిలుచు చుందురు ఎల్లెడ నియమ మునను!

న్యాయ మార్గము వీడక నడచు వారు

అక్రమములను అణచుచు అవని యందు

సత్య నిష్ఠను జూపుచు శాంతి నిల్పి

చక్కగా ప్రజ మెప్పును చాటు చుండ్రు


రాజ్య మంతట దక్షత రాణి పంగ

భార మంతయు మోయుచు బలము తోడ

ఉక్కు చట్రము వలె వీరు ఉర్వి నిల్చి

పరమ నిష్ఠతో నేలుదు ప్రజల నెపుడు!

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

21.4.2026




కామెంట్‌లు లేవు: