సృష్టి విలాసం!
నువ్వొస్తూనే నవ్వుల జల్లుల్ని తీసుకొస్తావో
నువ్వొస్తేనే నవ్వుల జల్లులే నీతో వస్తాయో
మానస కేదారాలన్నీ మృదుమధురం చూపులన్నీ చిగురించిన పతాకాల రెపరెపలే
నీ అడుగుల తాకిడికే
మది గుడులన్నీ సిరిగంటల సవ్వడులే!
నువ్వు నాతోనే ఆడతావో
నేను నీతోనే ఆడతానో
గెలుపోటములు విలాసాల్లో
ఒకర్నొకరమెంతగా కలిసిపోయాం!
కళ్ళ గంతలతో మళ్ళీ
ఒకర్నొకరం
కలిసేదాకా
అటో ఇటో యెటో...!
-దార్ల
8.12.2017
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి