"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

23 నవంబర్, 2025

నా చుట్టూ శూన్యమేదో ఆవరిస్తోంది !

 

నా చుట్టూ శూన్యమేదో ఆవరిస్తోంది ! 


నిజాన్ని చూడలేకపోతున్నాను

నిజాన్ని వినలేకపోతున్నాను

నిజాన్ని ఊహించలేకపోతున్నాను


ఆ మొక్కను చూడు

ఈ చిరుగాలితో సయ్యాటలాడుతుంది

అదే హోరుగాలికి తల్లడిల్లిపోతుంది

ఒరిగిపోయినందుకు బాధపడక

తనకు ఆసరా అయిన భూమితల్లిని ముద్దాడటానికి దాన్నే తనకు దక్కిన అవకాశంగామలుచుకుంటుంది

తాను విరిగిపోయినా

తాను ఒరిగిపోయినా 

తనను తాను మళ్ళీ చిగురించుకొనేందుకే చివరి వరకూ ప్రయత్నం …!

ఇంక చిగురించలేకపోతే 

తన సంతానాన్ని నేలపై విడిచి

తాను నవ్వుతూ ఎండిపోతుంది

తానెక్కడికో మాయమైపోతుంది

ఆ నవ్వునే

నేనెందుకు నవ్వలేకపోతున్నాను?

నిజాన్ని చూడలేకపోతున్నాను

నిజాన్ని వినలేకపోతున్నాను

నిజాన్ని ఊహించలేకపోతున్నాను


ఆ వర్షం చినుకుల్లో 

తనువునంతా చిలకరించుకుంటుంది

సూర్య కిరణాలు తనపై పడగానే

తనలో దాగిన వేయి సూర్యుళ్ళ

చేతులు చాస్తూ 

బయటకొస్తుంటే పరవశించిపోతుంది

ఆ వర్షంలోనో ఏదొకనాడు

తన చివరి స్నానాన్నీ 

మౌనంగా ముగించేసుకుంటుంది

ఆ స్నానమంటే

నాకెందుకింత భయమేస్తుంది?

నిజాన్ని చూడలేకపోతున్నాను

నిజాన్ని వినలేకపోతున్నాను

నిజాన్ని ఊహించలేకపోతున్నాను

దార్ల వెంకటేశ్వరరావు 23.11.2025

....

The Enveloping Void

​A certain void is closing in around me!

​I cannot see the Truth,

I cannot hear the Truth,

I cannot imagine the Truth.

​Look at that plant...

It plays games with the gentle breeze,

Yet trembles before the gale.

It does not grieve for having fallen;

Instead, it takes the fall as a chance to kiss Mother Earth, its support.

Even if broken,

Even if bent,

It strives until the very end to sprout once more...!

And if it can sprout no longer,

It leaves its offspring upon the soil,

Dries up with a smile,

And vanishes into the unknown.

​That smile...

Why is it that I cannot smile like that?

​I cannot see the Truth,

I cannot hear the Truth,

I cannot imagine the Truth.

​In the raindrops,

It drenches its entire body.

When the sun's rays touch it,

It rejoices as the hands of a thousand suns hidden within

Stretch out and emerge.

Yet, in that same rain, one day,

It silently concludes its final bath.

​That final bath...

Why does it terrify me so?

​I cannot see the Truth,

I cannot hear the Truth,

I cannot imagine the Truth.

— Darla Venkateswara Rao, 23.11.2025









కామెంట్‌లు లేవు: