ఆత్మలసంగమం
శబ్దాల సముద్రం ఆగిపోయిన వేళ,
అనుభూతి నిశ్శబ్దమై దోచిన వేళ,
మనసు కొండలపై తేలియాడే నీటిలా,
ప్రశాంతమై ఉంటుందో పచ్చని పుట్టిలా!
అల్లికల వలయాలు ఆగిపోయిన వేళ,
ఆలోచనల వనమంతా సవ్వడిలేని,
నింగి కింద నిలిచిన ఓ మౌన నదిలా,
దానిపై మనసుకి చిరుగాలేదో
మెత్తగా తాకుతున్న వేళ.
బయటి సొరంగాలన్నీ క్షణభంగురమైనా
లోనేదో నిత్యం వెలిగే జ్యోతి,
మనసుకేదో ప్రశాంతమైన స్థలం దొరికింది
అన్వేషించాలిక దాని లోతుల గమనం.
అడుగు చప్పుడుకూడా భయపడే ఆ రేయి,
ప్రకృతి కవచంలో మౌన త్రివేణీ సంగమం
ఆ మౌనమే మనసుకు బలమైన ప్రశాంతత,
ఆ మౌనమే ఆత్మలన్నీ ఏకమైన లక్ష్యం!
Darla Venkateswara Rao, 27.11.2014
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి