శుభాభినందనలు ఆచార్యవర్యా!
సీ.
లోతైన విషయాన్ని హితైక భావంగ
వివరించు విజ్ఞాన విజయుడితడు!
కవిభావ పరిమళాన్ని కవుల కందింప!
కర్తవ్యమనియెంచు కార్యశీలి!
అక్షరాలనడుమ లక్షణాలు నిలిపి
దక్షత భాషించు దార్శనికుడు!
అజ్ఞాత కవులకు యాలంబ మగుచు తా
వ్యాఖ్యాన ధీయుక్తి యాదరించు!
తే.గీ.
పలుకుదేనెల తెలుగున పండితుండు!
విశ్వవిద్యల విలువకు వేల్పుయితడు!
దారిచూపగ కవులకు! దార్ల యితడు!
నేటితరమున భాషకు మేటియితడు!
అభినందనలతో...
కవికోకిల,డా జె వి చలపతిరావు,
తెలుగు అధ్యాపకులు, విజయవాడ
11.8.2024
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి