( రచయితల రచనలు- హక్కుల గురించి విద్యార్థులకు
తెలియజేయడానికి దీన్ని ప్రచురిస్తున్నాను. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు)
గ్రంథ హక్కుల వివాదంలో
శేషేంద్రశర్మ కుమారుడికి ఊరట
హైదరాబాద్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ గ్రంథాల హక్కులకు సంబంధించిన కేసులో ఆయన కుమారుడు సాత్యకికి హైకోర్టులో ఊరట లభించింది. గ్రంథాలపై హక్కులన్నీ కుమారుడికే చెందుతాయని కోర్టు స్పష్టం చేసింది. గ్రంథాలపై హక్కులన్నీ శేషేంద్రశర్మ 1989లో కుమారుడికి రాసిచ్చారు. ఆయన మరణానంతరం సదరు గ్రంథాలపై తనకే హక్కులు ఉన్నాయని హైదరాబాద్‌కు చెందిన ఇందిరాదేవి సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ, సిటీ సివిల్ కోర్టు సాత్యకికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ పిటిషనర్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. హైకోర్టు దిగువ కోర్టు తీర్పును సమర్థిస్తూ హక్కులు సాత్యకికి చెందుతాయని తీర్పు వెలువరించింది.
Andhra Jyothi : Daily : 26th January 2024
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి