"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

24 డిసెంబర్, 2023

Extension Lecture on Research Methodology for KSOU, Mysore on 24.12.2023

 


కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం, తెలుగు అధ్యయన కేంద్రంలో పరిశోధన చేస్తున్న పరిశోధక విద్యార్థులకు 24 డిసెంబర్ 2023వ తేదీన 'పరిశోధనలో పాటించాల్సిన ప్రాథమిక సూత్రాలు పరిశోధన గ్రంథస్వరూప స్వభావాలు' అనే అంశంపై ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆన్లైన్ ద్వారా సుమారు ఒక గంటన్నర పాటు ప్రత్యేక ఉపన్యాసాన్ని ఇచ్చారు. పరిశోధనలో శాస్త్రీయమైనటువంటి విధానాలు పాటించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చునని అవి ఎలా సాధించాలో ఒక్కొక్క విద్యార్థికి వాళ్ల వాళ్ల అంశాలను ఆధారంగా చేసుకుని తెలుగు శాఖ అధ్యక్షులు, హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు  వివరించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు అధ్యయన శాఖ, కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం అధ్యాపకుడు డాక్టర్ చక్రవర్తి కార్యక్రమాన్ని సమన్వయించారు. శాఖ అధ్యక్షుడు ఆచార్య ఎం రామనాథ నాయుడు ఈ ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యాలయాలలో ఉన్న  నిష్ణాతుల చేత తమ విద్యార్థులకు ఉపయోగపడే అంశాలపై ప్రత్యేక ఉపన్యాసాలను ఏర్పాటు చేశామని దానిలో భాగంగానే పరిశోధన పద్ధతులపై తమ విద్యార్థులకు అవగాహన కలిగించేలా ఈ ప్రత్యేక ఉపన్యాసాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.


కామెంట్‌లు లేవు: