"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

26 December, 2023

డా. సత్యగాయత్రి డాక్టరేట్ సిద్ధాంత గ్రంథావిష్కరణ (25.12.2023)

భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుగారితో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

*NewsReport/25.12.2023/ex Vice-president*

*డా.సత్య గాయత్రి డాక్టరేట్ సిద్ధాంత గ్రంథావిష్కరణ*

సెంట్రల్ యూనివర్సిటీ తెలుగుశాఖలో పరిశోధన చేసి పిహెచ్.డి. డిగ్రీ పొందిన డా.సత్యగాయత్రి జనమంచి ముద్రించిన గ్రంథాన్ని సోమవారం సాయంత్రం (25.12.2023) భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూపుస్తకాన్ని ఆవిష్కరించటం ఆనందదాయకమనీ, చండ కౌశికమ్, తపతీ సంవరణం, సుభద్రా ధనంజయం, ఛత్రపతి సామ్రాజ్యమ్ వంటి నాటకాల మీద పరిశోధన రూపంలో అనేక నూతన విషయాలు ఆవిష్కరించిన పరిశోధకురాలు సత్యగాయత్రికి అభినందనలు తెలిపారు.సత్య హరిశ్చంద్రుడు, ఛత్రపతి శివాజీ లాంటి మహనీయుల జీవితాల గురించి ఈతరం యువత తెలుసుకోవాలన్నది నా ఆకాంక్ష. లోతైనా పరిశీలన ద్వారా ఈ మహనీయుల జీవితాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి "తెలుగు కావ్యాలుగా రూపొందిన సంస్కృత నాటకాలు" పుస్తకం ద్వారా యువతలో కలుగుతుందని ఆశిస్తున్నానని ఆయన ఆకాంక్షించారు.‘తెలుగు కావ్యాలుగా రూపొందిన సంస్కృత నాటకాలు-పరిశీలన’ అనే అంశంపై ఆచార్య రేమెల్ల వెంకట రామకృష్ణశాస్త్రి పర్యవేక్షణలో డా.సత్య గాయత్రి జనమంచి తన డాక్టరేట్ పూర్తి చేశారు. ఈ గ్రంథాన్ని ముద్రించడానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వారు కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ గ్రంథాన్ని తన తల్లిదండ్రులు శ్రీమతి జనమంచి సీతారామరాజ్యసుబ్బలక్ష్మి, వేంకట లక్ష్మీనరసింహారావు, శ్రీమతి కోటపల్లి సత్యదుర్గాంబ, సీతారామమూర్తిగార్లకు అంకితమిచ్చారు. ఈ పరిశోధన గ్రంథానికి డా.సత్యగాయత్రి గ్రంథం ప్రచురణ కాకముందే గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ సాహిత్య సేవ పురస్కారం రాజా వాసిరెడ్డి జాతీయ సాహితీ పురస్కారాలను అందుకున్నారు. అటువంటి ఉత్తమ పరిశోధన గ్రంథాన్ని ప్రచురించిన ఈ గ్రంథాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్య నాయుడు ఆవిష్కరించగా, ఈ కార్యక్రమంలో హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తార ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఎం.మంజుశ్రీ,, శ్రీకోటపల్లి సీతారామమూర్తి, శ్రీమతి సత్యదుర్గాంబ, డా.నలసాని రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

No comments: