ఓటు పౌరుడికి లభించిన ఒక నిశ్శబ్ద ఆయుధం. దాన్ని శక్తివంతంగా ఉపయోగించుకున్నప్పుడు సమర్థులైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోగలుగుతాం. ఒక నిశ్శబ్ద విప్లవాన్ని చూస్తాం. నేడు గ్రామీణ ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నంతగా పట్టణ నగర ప్రాంతాలలో ఓటు హక్కును వినియోగించేవారు తక్కువగా ఉంటున్నారు. విద్యావంతులలో ఓటు వేయాలని ఆసక్తి తగ్గిపోతుంది. మనం ఓటు వేయలేనప్పుడు మనం మన హక్కుల్ని కోల్పోయినట్లు మాత్రమే కాదు, జీవించి కూడా శవప్రాయంగా జీవిస్తున్నట్లే భావించాలి.
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
తెలుగు శాఖ అధ్యక్షులు,
సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి