అభినందనలు - శుభాకాంక్షలు
నూతన విద్యా విధానం (NEP) 2020 ప్రకారం ఎం.ఫిల్. కోర్సు తీసేశారు. అందువల్ల ఎం.ఏ.స్థాయిలో పరిశోధన పట్ల ఒక అవగాహన కల్పించడం కోసం Techniques of Writing a Dissertation అనే కోర్స్ ని
2022-2023 విద్యా సంవత్సరం నుండి తెలుగు శాఖ, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రారంభించాం. మొదటి సంవత్సరం థియరీ, రెండవ సంవత్సరం ప్రాజెక్టులో భాగంగా 60 పుటలు తగ్గకుండా, నూరు పుటలు మించకుండా ఒక పరిశోధన గ్రంథాన్ని సమర్పించాలి. నిజానికి తమ కోర్సులు పూర్తి చేస్తూ ఒకే సెమిస్టర్ లో ప్రాజెక్టును పూర్తి చేయడం కొంచెం కష్టమే. అయినప్పటికీ ఎం.ఫిల్ కి ఏ మాత్రం తీసిపోకోకుండా చాలామంది మంచి పరిశోధన వ్యాసాలను తమ ప్రాజెక్టులుగా సమర్పించారు. అందుకు ఎంఏ తెలుగు పరిశోధక విద్యార్థులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే కొంచెం కష్టం అయినప్పటికీ విద్యార్థులకు పరిశోధన పట్ల ఆసక్తి కలిగించే ప్రాజెక్టులను చేయించినందుకు అధ్యాపకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
తెలుగు శాఖ అధ్యక్షులు,
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
16.5.2023
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి