కొత్తగా కనిపించడం అలవాటయింది కాని ఈరోజు త్వరగా కనిపించింది సృజన నేడు. అందుకే త్వరగా స్పందించడం.
ఆచార్య రవ్వా శ్రీహరి గారికి నివాళిగా సహృదయులు, మిత్రులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి వ్యాసం ఈరోజు మహాకవి శ్రీశ్రీ జయంతి కాబట్టి మహా నివాళిగా కనిపిస్తోంది. రవ్వంత ఉన్నోళ్ళే కొండంతగా కనిపించాలని చూసే ప్రయత్నాల్లో మునిగి తేలుతుంటే రవ్వా శ్రీహరి ఓ మేరుపర్వతమైనా ఎదిగి ఒదిగి పోవడం వ్యాసంలో చక్కగా చూపించారు దార్లవారు. "ఎంతెత్తో అంతలోతు నీ వ్యక్తిత్వం" అన్న డా.తిరుమల శ్రీనివాసాచార్యగారి మాట నిజం. సంప్రదాయాలను తిరస్కరించడాన్నే నేను సమర్ధించినా, వాటిని అవగాహన చేసుకొని సంప్రదాయవాదుల్ని సంస్కరణల వైపు ఆలోచించేలా చేసేవారిలో ఒకరిగా శ్రీహరి గారిని చూపించించడం వారి విశాల హృదయాన్నే చూపించింది. ఒక వ్యాసమో, కథో ఇవ్వడానికి తంటాలు పడేవాళ్ళను(నాతో కలిపే చెబుతున్నాను) చూశాము. రవ్వాగారు ఒక సంస్థలాగా ఎన్నెన్ని గ్రంధాలను రాశారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయనకు సంస్కృతమెంతో తన స్థానిక తెలుగు కూడా అంతే అన్న విషయం వ్యాసకర్త మాటల్లో తెలుస్తుంది. రవ్వాగారి వ్యక్తిత్వాన్నీ, ప్రతిభనూ, అస్తిత్వాన్నీ ప్రతిబింబించే మూడు అంశాలను తెలిపి కొండను అద్దంలో చూపారు. దార్లవారికి, సృజన నేడుకు ధన్యవాదాలు.
@జంధ్యాల రఘుబాబు
9849753298
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి