"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

09 అక్టోబర్, 2022

ఆచార్య వెలమల సిమ్మన్నగారి పరిచయం


కవి హృదయాలకు సాహితీ వందనాలు..భాషాశాస్త్రవేత్త, బహుగ్రంథకర్త, విశిష్టసాహితీవేత్త, ప్రఖ్యాత పరిశోధకులు, ఉత్తమ అధ్యాపకులు, శతాధిక విమర్శనాత్మక వ్యాసరచయిత, నిరంతర నిర్విరామ సాహితీ కృషీవలుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆంధ్రా విశ్వవిద్యాలయం పూర్వ ప్రొఫెసర్ *ఆచార్య వెలమల సిమ్మన్న* గారి గురించి నావైన పదాలలో.. 


🌺జనన విశేషాలు🌺

సిమ్మన్న  గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలం, *తిమడాం* గ్రామస్తులైన డాక్టర్ *వెలమల కృష్ణమూర్తి - ఆరుద్రమ్మ* దంపతుల సంతానంగా 1955, మార్చి 1న జన్మించారు.. 

సిమ్మన్న గారికి ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు *సులోచన, లక్ష్మి* వున్నారు.. పెద్ద తమ్ముడు *మన్మధరావు* ఊర్లోనే వ్యవసాయం చూసుకుంటాడు, చిన్న తమ్ముడు *రంగారావు* ఢిల్లీలో సర్వే విభాగంలో ఉద్యోగి..


🌺విద్యాభ్యాసం🌺 

సిమ్మన్న  గారు ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, *తిమడాం లో* పూర్తి చేశారు. ఇంటర్ *నరసన్నపేట* ప్రభుత్వ జూనియర్ కాలేజీలో, డిగ్రీ *విజయనగరం* ఎం.ఆర్. కళాశాలలో, ఎం.ఎ ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో చదివారు.  డాక్టరేట్ పట్టాను కూడా పొందారు. 


ఎంతో దీక్షతో సిమ్మన్న గారు సంస్కృతం, హిందీ, తమిళం, ఉర్దూ, లింగ్విస్టిక్స్, ట్రాన్స్లేషన్, ఫంక్షనల్, ఇంగ్లీషు, మొదలైన అంశాల్లో ఏడు డిప్లోమాలు పొందారు..


🌺కుటుంబ నేపథ్యం🌺

సిమ్మన్న గారికి 1986లో *పార్వతి* గారికి వివాహం జరిగింది.. వీరికి *గీతంలో* బి.టెక్ చేసి *అమెరికాలో* ఉద్యోగం చేస్తున్న కుమారుడు *ప్రశాంత్* మరియు ఆంధ్రా యూనివర్సిటిలో ఎం.టెక్ చేసి అమెరికాలో ఎం.ఎస్ చేస్తున్న కూతురు *ప్రియాంక* వున్నారు.. కూతురుకు పెళ్ళి అయినది, ఆమె భర్త *అవినాష్* అమెరికాలోనే ఉద్యోగం చేస్తున్నారు...


🌺వృత్తి వివరాలు 🌺

సిమ్మన్న గారు 1986లో ఆంధ్రా విశ్వవిద్యాలయంలో లెక్చరర్ ఉద్యోగంలో చేరారు., 1991లో రీడర్ ఇన్ తెలుగు, 2002లో ప్రొఫెసర్ గా పదోన్నతులు పొందారు..

ఆంధ్రా విశ్వవిద్యాలయం లో *తెలుగు ప్రొఫెసర్* గా పనిచేసి పదవీ విరమణ పొందారు..


🌺బోధనారీతి🌺

సిమ్మన్న గారు ఎం.ఎ. చదివే రోజుల్లో *ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి* గారి బోధనా విధానానికి ఆకర్షితులై అదే రీతిలో పాఠ్యాంశ విశ్లేషణ వివరణ ఇవ్వాలనే పట్టుదలతో అధ్యయనం చేస్తున్న అంశాన్ని కూలంకషంగా పరిశీలించి, క్లిష్టమైన పాఠ్యాంశాన్ని సైతం సులభమైన పద్ధతిలో దూరవిద్యా కేంద్రాల్లో ప్రత్యేకంగా నిర్వహించే తరగతుల్లో బోధించారు..


ఆంధ్ర విశ్వకళా పరిషత్, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో తెలుగుశాఖలో అధ్యాపక ధర్మం నిర్వహిస్తూ విద్యార్థుల మస్తిష్క క్షేత్రాల్లో అక్షర బీజాలు వెదజల్లుతూ, ఉత్తమ ఫలాలు అందుకుంటూ, తెలుగు సాహితీ సరస్వతికి సేవలందించారు..  *ఉపాధ్యాయుడు నిత్యవిద్యార్ధి* అనే సూక్తిని సార్ధకం చేస్తూ, సిమ్మన్న గారు విద్యార్థి లోకానికి ఆదర్శంగా నిలిచారు. , 


🌺సాహితీ ప్రస్థానం🌺

సిమ్మన్న  గారు భాష, సాహిత్యం, వ్యాకరణం, భాషా శాస్త్రం, విమర్శ, పరిశోధన, మొదలైన రంగాలకు సంబంధించి *90 గ్రంథాల్ని* రాశారు.. 500కు పైగా *పరిశోధన పత్రాలు* వ్రాసారు..  భారతి, తెలుగు, నవభారతి, వాఙ్మయి, తెలుగు విద్యార్ధి, సమాలోచన, భావవీణ, మిసిమి, సాహితీ స్రవంతి, చేతన, ఆంధ్రప్రదేశ్, చినుకు, మూసీ, నడుస్తున్న చరిత్ర, తెలుగు వెలుగు ఉపధ్యాయ మిత్ర విశాఖ సంస్కృతి, మొదలైన ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 160కి పైగా వివిధ *సెమినార్లలో* హాజరై విలువైన, ఉత్తమమైన పరిశోధన పత్రాల్ని సమర్పించారు. 50కి పైగా *రేడియో ప్రసంగాలు* చేసి శ్రోతల్ని అలరించారు.. వీరి గైడెన్స్ లో 28 మందికి ఎం.ఫిల్, 16 మందికి పిహెచ్.డి.లు వచ్చాయి. సిమ్మన్న రచనల పై వివిధ పత్రికల్లో ప్రముఖులు 45 *వ్యాసాలు* రాశారు. వీరి రచనలపై వివిధ విశ్వవిద్యాలయాల్లో *పరిశోధన* జరుగుతోంది..


బహు విద్యాయోగ్యతలు కలిగిన ఉత్తమ విద్యార్థిగా, పరిశోధన స్థాయి విద్యార్థులకు మార్గదర్శకునిగా, ఆకాశవాణిలో గళాన్ని వినిపిస్తూ, తన బాణిలో తెలుగు సాహితీ రంగంలో కలాన్ని నడిపిస్తూ, సభల్లో, సెమినార్లలో, ప్రసంగాల ద్వారా సాహితీ అభిమానుల్ని ఆకర్షిస్తూ, విశ్వవిద్యాలయ స్థాయిలో సిమ్మన్న గారు ప్రశంసల్ని, మన్ననలు పొందారు.


🌺సిమ్మన్న గారు పుస్తకాలు చదివి ఉన్నతమైన ఉద్యోగాలు పొందిన వారు🌺

ఆకురాతి పల్లవి  IAS 

గోపాలకృష్ణ  IAS 

రాహుల్ IAS 

శ్రీధర్ బాబు  IAS 

ఇంకా ఇలా చాలా మంది ఉన్నారు..

అలాగే.. 

డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు కూడా ఉన్నారు..


🌺సిమ్మన్న గారి రచనలు (సేకరించినవి)🌺

📙దర్శిని.

📙సాహిత్య మంజరి.

📙సాహిత్యం - ప్రయోజనం. 

📙తెలుగు భాషా స్వరూపం.

📙సాహితీ స్రవంతి.

📙విశ్వనాథ శబరి.

📙సాహితీ సౌరభం.

📙తెలుగు భాషా శాస్త్రవేత్తలు.

📙వ్యాకరణ ప్రకాశిక.

📙ప్రముఖ పత్రికా సంపాదకులు.

📙సాహిత్యసుధ.

📙తెలుగు వెలుగు.

📙అన్వేషణ.

📙బోయి భీమన్న సాహితీ సమాలోచన.

📙సాహిత్యం సమాజం.

📙అక్షరార్చన.

📙సాహితీ పరిమళం.

📙సాహిత్య సంపద.

📙సాహితీ రంజని.

📙ఆంధ్రనాయక శతకం - రచనా వైశిష్ట్యం.

📙ఎన్.జి.ఓ. నాటకం-సామాజిక చైతన్యం.

📙వ్యాకరణ సంజ్ఞాకోశం.

📙కృష్ణపక్షం కృష్ణశాస్త్రి భావ కవితా సౌందర్యం.

📙ఆంధ్రప్రశస్తి విశ్వనాథ కవితా వైభవం.

📙అవలోకనం.

📙అక్షరప్రభ.

📙ముత్యాల సరాలు మహాకవి మార్గం.

📙గబ్బిలం - జాషువా దృక్పథం.

📙మహాప్రస్థానం - శ్రీశ్రీకవితాదర్శం.

📙అమృతం కురిసిన రాత్రి తిలక్ కవితాత్మ.

📙బాలవ్యాకరణం - శాస్త్రీయ వ్యాఖ్యానం.

📙సాహితీ వీక్షణం.

📙హృదయ దర్పణం

📙కాళ్ళకూరి నాటకాలు పరిశీలన.

📙సాహిత్య సౌందర్యం.

📙లక్షణ దీపిక.

📙యుగకర్త గురజాడ.

📙కవిత్వం-పరిశీలన.

📙అడివి బాపిరాజు కథలు.

📙కళాతపస్వి బాపిరాజు.

📙తెలుగు శబ్ద పరిణామం.

📙తెలుగు భాషా చంద్రిక.

📙జాషువా పిరదౌసి - ఒక పరిశీలన.

📙బాల వ్యాకరణం (సంజ్ఞ, సంధి, సమాన పరిచ్ఛేదాలు విశ్లేషణ).

📙రసతరంగిణి.

📙తెలుగు సాహిత్య విమర్శ.

📙తెలుగు భాషాకౌముది.

📙తెలుగు భాషాతత్వం.

📙సాహితీ కిరణాలు.

📙బాపిరాజు భాషా వైదుష్యం.

📙ప్రపంచ భాషలు.

📙సంధి తులనాత్మక పరిశీలన.

📙సహృదయలహరి.

📙తెలుగు భాషా దర్పణం. 

📙తెలుగు భాషా సంజీవని.

📙తెలుగు భాషా చరిత్ర.

📙భాషా శాస్త్ర వ్యాసాలు.

📙విమర్శ వివేచన.

📙నాటకం సరిశీలన.

📙ఆధునిక సాహిత్య విమర్శ.

📙తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు.

📙ప్రముఖ భాషా శాస్త్రవేత్తలు.

📙తెలుగు భాషా దీసిక.

📙భాషా పరిశోధనా వ్యాసాలు.

📙భాషా శాస్త్ర విజ్ఞానం.

📙భాషా చారిత్రక వ్యాసాలు.

📙భాషానుశీలనం.

📙ఆధునిక భాషాశాస్త్రం.

📙లోచనం.

📙డాక్టర్ సి.ఆర్.రెడ్డి.

📙విమర్శ భారతి.

📙భాషాబోధిని

📙తెలుగు సాహిత్యంలో ప్రక్రియలు

📙విమర్శ సరామర్శ.

📙విమర్శనదర్శనం

📙తెలుగు సాహిత్య చరిత్ర

📙ప్రముఖ సాహిత్య విమర్శకులు.

📙తెలుగు సంస్కృతిపై బౌద్ధమత ప్రభావం.

📙వ్యాస జ్యోతి.

📙సాహితీ మహతి.

📙ప్రాచీన విశిష్ట బాషగా తెలుగు.

📙మాతృభాషలు పరిరక్షణ.

📙గురజాడ భాష.


🌺బిరుదులు - పురస్కారాలు🌺

👉1985లో.. ఆంధ్ర విశ్వకళా పరిషత్, విశాఖపట్నం వారిచే "రఘుపతి వెంకట రత్నం నాయుడు బెస్ట్ థీసెస్ అవార్డు" 

👉1995లో.. ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్నం వారిచే "బెస్ట్ రీసెర్చర్ అవార్డు".

👉2001-2002లో.. ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్నం వారిచే "దళితస్త్రీ" ప్రాజక్టు.

👉2003లో.. డాక్టర్ పిల్లి శాంసన్ స్మారక సాహితీ పీఠం గుంటూరు వారిచే "డాక్టర్ పిల్లి శాంసన్ స్మారక సాహితీ పురస్కారం.

👉2005లో.. సాహితీ మిత్రులు సాహితీ సంస్థ - మచిలీపట్నం వారిచే "సాహితీ మిత్రులు సాహితీ పురస్కారం".

👉2005లో.. ఆంధ్రప్రదేశ్ సాహితీ సాంస్కృతిక సమాఖ్య, శ్రీకాకుళం వారిచే “ఆంధ్ర ప్రదేశ్ సాహితీ సాంస్కృతిక సమాఖ్య పురస్కారం". 

👉2005లో.. ఇండియన్ హైకూ క్లబ్ - అనకాపల్లి వారిచే "ఆచార్య రొక్కం రాధాకృష్ణ సాహితీ పురస్కారం".

👉2006లో.. ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి YS రాజశఖరరెడ్డి గారిచేతుల మీదుగా  "భాషా విశిష్ట పురస్కారం".

👉2006లో.. ఆంధ్ర సారస్వత సమితి, మచిలీపట్నం వారిచే "ఉగాది సాహితీ ప్రతిభా పురస్కారం".

👉2007లో..  శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వారిచే "ధర్మ నిధి పురస్కారం".

👉2007లో.. తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు, తిరుపతి సందర్భంగా "ఆత్మీయ పురస్కారం".

👉2007-2010లో.. తెలుగుశాఖ, ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్నం వారిచే "బోర్డు ఆఫ్ స్టడీస్ ఇన్ తెలుగు" (పి.జి)చైర్మన్. 

👉2008లో..జ్యోత్స్నా కళాపీఠం, హైదరాబాద్ వారిచే "ఉగాది సాహితీ పురస్కారం" 

👉2008లో.. తెలుగు తేజం, విశాఖపట్నం వారిచే "తెలుగు భాషా పురస్కారం".

👉2008లో.. డైరెక్టర్, యు.జి.సి. జాతీయ సదస్సు, ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్నం గారిచే "బహుముఖ ప్రజ్ఞాశాలి కట్ట మంచి రామలింగా రెడ్డి" పురస్కారం.

👉2009లో.. ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్నం వారిచే "బెస్ట్ ఎకడమీషియన్ అవార్డు".

👉2009లో.. ఆంధ్ర ప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, విశాఖపట్నం వారిచే "పురిపండా అప్పల స్వామి అవార్డు".

👉2011లో.. రసభారతి సాహితీ సంస్థ, విజయవాడ వారిచే "విశిష్ట సాహితీ పురస్కారం".

👉2011లో.. ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ, హైదరాబాద్ వారిచే "తెలుగు భాషా చరిత్ర" - హిందీ భాషలోకి అనువాదం.

👉2012లో.. సత్యమూర్తి చారిటబుల్ ట్రస్టు, విశాఖపట్నం వారిచే "మోదు గురుమూర్తి స్మారక పురస్కారం".

👉2012లో.. భారత ప్రభుత్వం స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా "విశిష్ట సేవా పురస్కారం".

👉2012లో.. డాక్టర్ పట్టాభి కళాపీఠం, మచిలీపట్నం వారిచే "గిడుగు రామమూర్తి పంతులు ప్రతిభా పురస్కారం".

👉2012లో.. సత్యమూర్తి చారిటబుల్ ట్రస్టు 12వ వార్షికోత్సవ సందర్భం, విశాఖపట్నం వారిచే "భాషా బ్రహ్మ" పురస్కారం.

👉2012లో..  శ్రీమతి కుర్రాకోటి, సూరమ్మ స్మారక సాహితీ అవార్డు ఫౌండేషన్ కమిటీ - ఒంగోలు వారిచే "శ్రీమతి కుర్రాకోటి సూరమ్మ స్మారక సాహితీ పురస్కారం".

👉2013లో.. (పి.జి) - ఛైర్మన్, తెలుగు శాఖ, డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం గారిచే

"బోర్డు ఆఫ్ స్టడీస్ ఇన్ తెలుగు".

👉2013లో.. విజయనామ ఉగాది సందర్భంగా ఉత్తరాంధ్ర వెలమ సంక్షేమ సంఘం, విశాఖపట్నం వారిచే "ఉగాది గౌరవ పురస్కారం" 

👉2013లో.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖా మంత్రి  శ్రీ కె. పార్థసారధి గారి చేతులు మీదుగా ప్రతిష్టాత్మకమైన "ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక అవార్డు".

👉2013లో.. ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్నం వారిచే "ఎకడమిక్ సెనేట్ సభ్యులు".

👉2014లో.. తెలుగు భాషా పరి రక్షణ సమితి, పుంగనూరు, చిత్తూరు వారిచే "తెలుగు వాఙ్మయ ప్రగతి రత్నాలు పురస్కారం".

👉2014లో.. శ్రీ ప్రభాసాంబ సాహితీ పీఠం, విశాఖపట్నం వారిచే "భాషా విభూషణ" బిరుదు.

👉2014లో.. శ్రీ శ్రీ సాయి సరిగమ సేవా సంస్థ, విశాఖపట్నం వారిచే "సాహితీ బ్రహ్మ" అవార్డు.

👉2015లో.. అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతులు మీదుగా శ్రీమన్మథ నామ సంవత్సర ఉగాది సందర్భంగా

"విశిష్ట ఉగాది సాహితీ పురస్కారం". 

👉2015లో.. సాహితీ తపస్వి పోలవరపు కోటేశ్వరరావు సాహితీ కళాపీఠం మరియు ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, విజయవాడ వారిచే "సాహితీ తపస్వి పోలవరపు కోటేశ్వరరావు సాహితీ పురస్కారం".

👉2016లో.. "విజయభావన" "ఉగాది సాహితీ పురస్కారం" ధుర్ముఖి ఉగాది సందర్భంగా, విజయనగరం, 

👉2016లో.. విజయభావన, విజయనగరం వారిచే "సాహితీ సవ్యసాచి" - బిరుదు, 

👉2016లో.. "అర్పిత" సాంస్కృతిక, సామాజిక సేవాసంస్థ, విశాఖపట్నం వారిచే "ఆంధ్రరత్న" బిరుదు, 

👉2021లో.. కవి సంధ్య సాహిత్య పురష్కారం.

ఇలా ఎన్నో పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు. నూట అరవైకి పైగా వివిధ ప్రసిద్ధ సాహితీ సంస్థలు, మరియు ఇతర ప్రముఖ సంస్థలు ఆచార్య సిమ్మన్న సాహితీ కృషిని గుర్తించి ఘనంగా సన్మానించాయి.


🌺అనితర బాధ్యతలు🌺

🔸సభ్యులు.. "యు.జి.బోర్డు ఆఫ్ స్టడీస్ ఇన్ తెలుగు" - ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజిల్లో డాక్టర్ వి.యస్. కృష్ణా కాలేజీ - విశాఖపట్నం, ఆంధ్ర లయోలా కాలేజీ - విజయవాడ, జె.ఎమ్.జె. కాలేజి తెనాలి, ఎమ్.ఆర్. కాలేజి - విజయనగరం, సెంట్ జోసెఫ్ కాలేజి ఫర్ ఉమెన్ - విశాఖపట్నం, వై. యస్.ఎన్ కాలేజి - నరసాపురం, సిద్ధార్థ కాలేజి - విజయవాడ, మొదలైన కాలేజీలు.


🔸సభ్యులు.. "పి.జి. బోర్డు ఆఫ్ స్టడీస్ ఇన్ తెలుగు" - ఉస్మానియా (హైదరాబాద్) ఆచార్య నాగార్జున (గుంటూరు) ఆది కవి నన్నయ (రాజమండ్రి), కృష్ణా (కృష్ణాజిల్లా) మొదలైన విశ్వవిద్యాలయాలు.


🌺సదస్సులు🌺

🔹సింగపూర్ దేశంలో సింగపూర్ తెలుగు సమాజం, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, లోక్నాయక్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, మలేషియా తెలుగు సంఘం సారథ్యంలో

జరిగిన 5వ ప్రపంచ తెలుగు సదస్సుకు హాజరయ్యారు.


🔹"తానా " (తెలుగు అసోషియేషన్ నార్త్ అమెరికా) డెట్రాయిడ్, మిషిగన్ రాష్ట్రం, అమెరికా సభలకు హాజరయ్యారు..


🌺చివరగా🌺

సిమ్మన్న గారు జీవితంలో అనుకున్న దానికన్నా ఎక్కువే సాధించారు, ఆశించిన దానికన్నా ఎక్కువే గుర్తింపు పొందారు.. ఎంతో మంది ప్రముఖులచే ప్రశంసలు, అవార్డులు,  సన్మానాలు పొందారు..  సిమ్మన్న గారు ఓ సాహిత్య శిఖరం, ఆయన రచనలకంటే ఉన్నతమైనది, మహోన్నతమైనది ఆయన వ్యక్తిత్వం..


భాష నశించిపోతే జాతి నశించిపోతుందని, చరిత్ర, సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోతాయని, అశ్రద్ద చేస్తే తెలుగు భాష మరుగున పడిపోతుందని, సిమ్మన్న గారు తెలుగు భాష, సాహిత్య ఔన్నత్యాన్ని అందరు గుర్తించేలా ఎన్నో రచనలు చేసినారు.. ఎందరో విద్యార్థులకు సాహిత్యాభిలాషులకు మార్గదర్శకులయ్యారు..


సిమ్మన్న గారు నిరంతరం భాషా సాహిత్య వ్యాసంగంలో వుంటారు, భాషా, సాహిత్య కృషి చేస్తున్నారు.. ఆయన సాహిత్యం దేశమంతా విస్తరించడమే కాకుండా విదేశాలలో సైతం పరిమళించింది.. ఆయనతో కొద్దిసేపు మాట్లాడిన వారు, ఎంతో కొంత తెలుగు భాష గురించి సాహిత్యం గురించి తెలుసుకుంటారు అనడంలో అతశయోక్తి ఏమీ లేదు..


ప్రాచీన సాహిత్యానికి సంబంధించి కానీ, ఆధునిక సాహిత్యానికి సంబంధించి కానీ, వ్యాకరణానికి సంబంధించి కానీ, భాషా చరిత్రకు సంబంధించి కానీ, భాషా శాస్త్రానికి సంబంధించి కానీ, సాహిత్య విమర్శకు సంబంధించి కానీ, ఏదో ఒక రంగంలో నిష్ణాతులు అన్పించుకున్నవారు పెక్కుమంది వున్నారు. అయితే పైన పేర్కొన్న అన్ని అంశాల్లోనూ, నిష్ణాతులు *ఆచార్య సిమ్మన్న* గారు..


తెలుగు భాష మరియు సాహిత్య ఔన్నత్య పరిరక్షణకై అహర్నిశలు కృషిచేస్తున్న ఆచార్య వెలమల సిమ్మన్న గారికి శుభాభినందనలు తెలియచేస్తూ..


మధుసూదన్ మామిడి

కరీంనగర్

సెల్ నం.8309709642

9701195116.

( వాట్సాప్ సౌజన్యంతో)

కామెంట్‌లు లేవు: