"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

04 August, 2022

HCU లో ఆజాదీకా అమృత మహోత్సవం.. సాహిత్య చర్చ

 

ఆచార్య ఆర్ ఎస్ సర్రాజు, ప్రొ.వైస్ ఛాన్సలర్, యూనివర్సిటీ హైదరాబాద్,  ఆచార్య వి.కృష్ణ, డీన్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షులు, ఆచార్య గుండిమెడ నాగరాజు, డి ఎస్ డబ్ల్యూ, ఆచార్య పిల్లలమర్రి రాములు ఇతర శాఖలకు చెందిన ఆచార్యులు 





భిన్నదృక్పథాల్లో ప్రతిఫలించిన భారతీయ సాహిత్యంలో దేశభక్తి
-
ఆచార్య వి.కృష్ణ వ్యాఖ్య


మనమంతా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతనే జన్మించిన వాళ్ళమనీ, స్వాతంత్ర్యం రాకపోతే ఎలా ఉండేదో ఆ బాధలను అనుభవించిన వారి అనుభవాలను బట్టి తెలుసుకోవాలని హెచ్ సియు ప్రొ-వైస్ ఛాన్సలర్ ఆర్.ఎస్.సర్రాజు పేర్కొన్నారు. విదేశాలకు వెళ్ళినప్పుడు మనం భారతీయులుగా చెప్పుకునేటప్పుడు హిందీ మన భాష అని చెప్పుకోవడం ఒక భారతీయుడుగానే చెప్పుకుంటామని, అలాంటప్పుడు భారతీయుడిగా మన అస్తిత్వాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారని ఆయన వివరించారు.
భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషలలోను దేశభక్తిని విభిన్న కోణాల్లో ప్రతిఫలించే రచనలు చేశారని, దేశమంటే మట్టి మాత్రమే కాదనీ, దేశమంటే మనుషులనే ఆలోచనలను కూడా కలిగించారని స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్ ఆచార్య వి.కృష్ణ పేర్కొన్నారు.
75 సంవత్సరాల స్వతంత్ర భారతీయ సాహిత్యం' అనే అంశంపై హెచ్ సియు లో గురువారం నాడు మానవీయ శాస్త్రాల విభాగంలో ఆజాదీకా అమృత మహోత్సవం లో భాగంగా వివిధ భాషల అధ్యక్షులు, ఆచార్యులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ చర్చాగోష్టికి స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్ ఆచార్య వి.కృష్ణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా.దేవేశ్ నిగమ్, స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ఆచార్య గుండి మెడ నాగరాజు మాట్లాడుతూ జాతీయత అనేది ఒక నిర్మాణాత్మక భావన అనీ, ఈ కార్యక్రమం జాతీయ సమైక్యతను, సమగ్రతను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు భారతీయ సాహిత్యంలో ఒకవైపు దేశభక్తి సాహిత్యం వస్తూనే‌ మరొకవైపు తమతమ అస్తిత్వాల్ని వెతుక్కోవడంలో భాగంగానే తెలుగు కవులు, రచయితలు రచనలు చేశారని అన్నారు.  ఆచార్య పిల్లలమర్రి రాములు  స్వాతంత్ర్యం వచ్చిందని సంతోషపడుతూనే ఇంకా సాధించవలసినదేమిటో శ్రీశ్రీ రాసిన పాడవోయి భారతీయుడా అనే పాటను విశ్లేషిస్తూ మాట్లాడారు.  ఒక కథ ఉదాత్తమైన సమాజాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నించాలని ఆయన అన్నారు. డా.గిరీష్ పవార్ మాట్లాడుతూ ఈ 75 సంవత్సరాల భారతీయ సాహిత్యాన్ని కేవలం భారతీయులే కాకుండా విదేశాల్లో ఉన్న వారి రచనలను కూడా పరిశీలించాలని అన్నారు. , ఈ కాలంలో భారతీయ సాహిత్యంలో అనేక సామాజిక అంశాల్ని వివరించారు. డా. జె.ఆత్మారామ్ (హింది), చీఫ్ వార్డెన్ ఆచార్య డి.విజయలక్ష్మి,, డిప్యూటీ చీఫ్ వార్డెన్ డా.నాగమణి, విద్యార్థినీ విద్యార్థులు ఈ చర్చా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.






 



No comments: