"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

09 August, 2022

వాన కురిసిన రాత్రి

 వానకురిసిన రాత్రి!



కాసేపు కవిత్వం ఒడిలో
సేదతీరాలనుంది
హృదయ వీణ పలికించే మౌనసంగీతంలో
తడిసి తడిసి ముత్యమవ్వాలనుంది
నువ్వలా దృశ్యం దృశ్యంగా కళ్ళముందు
కదిలాడుతుంటే
గట్లుతెగిప కళ్ళనలా
స్వచ్ఛంగా ప్రవహించనివ్వాలనుంది
ఈ వానకురిసిన రాత్రి
నేనూ ఓ వానచినుకునవ్వాలనుంది
కొండల మధ్య నుండి వచ్చేవని భ్రమించిన
ఆ సూర్యోదయాల్ని కాదు,
గుండెల్నుండి చీల్చుకొచ్చినా
నిజమైన శుభోదయాల్నే స్వాగతించాలనుంది
జీవితం ఊహల పల్లకీ కాదు
జీవితం ముళ్ళబాటలూ కాదు
జీవితం అరిషడ్వర్గాల్నీ పరుచుకున్న రహదారి!
జీవితం అన్నీ నీవై
అన్నీ నేనై కనిపించీ కనిపించని
సత్యం, శివం, సుందరం పరిచిన సౌందర్యం!
-  దార్ల వెంకటేశ్వరరావు, 9182685231
( సూర్య దినపత్రిక, అక్షరం పేజీ, 8.8.2022 సౌజన్యంతో)

No comments: