"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

31 July, 2022

అనేక సమస్యలకు పరిష్కార మార్గం యోగా' అంతర్జాతీయ సదస్సులో వక్తల వ్యాఖ్య '

 అనేక సమస్యలకు పరిష్కార మార్గం యోగా

అంతర్జాతీయ సదస్సులో వక్తల వ్యాఖ్య 

సదస్సులో పాల్గొన్న విశ్వర్షి లాహిరి వసంతకుమార్ గారితో వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ఆచార్యులు
మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారిని సత్కరిస్తున్న విశ్వర్షి వాసిలి వసంతకుమార్ గారు


మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు


విశ్వర్షి వాసిలి అక్షరాక్షర ప్రస్థానం పేరుతో 108 రోజులుగా జరిగిన అంతర్జాతీయ సదస్సు సమాపనోత్సవ ఆత్మీయ సమావేశం ఆదివారం (31.7.2022) యోగాలయ రీసెర్చ్ సెంటర్ సికింద్రాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రతిరోజు సాయంత్రం సుమారు ఒక ఐదు గంటలు చొప్పున 108 రోజులుగా భారతీయ తాత్విక దర్శనం, యోగా, ప్రాణాయామం విశిష్టతలను తెలియజేస్తూ వాసిలి వసంత కుమార్ గారు రాసిన వివిధ పుస్తకాలపై ఈ అంతర్జాతీయ సదస్సు జరిగింది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాల నుండి కూడా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల నుండి ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ద్రావిడ విశ్వవిద్యాలయం, మద్రాస్ విశ్వవిద్యాలయం, బెనారస్ కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఇలా అనేక విశ్వవిద్యాలయాల నుండి ఆచార్యులు పూర్వాచార్యులు సదస్సులలో పాల్గొని వివిధ అంశాలపై పత్రాలను సమర్పించారు.  భారతీయ తాత్విక దర్శనంలో యోగా విద్యకు విశిష్టమైన స్థానం ఉందని ఈ సమావేశంలో పాల్గొన్న ఆచార్యులు వక్తలు పేర్కొన్నారు. యోగా గురువు విశ్వర్షి వాసలి వసంత కుమార్ గారు రాసిన నేను అనే యౌగిక కావ్యం భారతీయ యోగా విశిష్టతను భారతీయ తాత్విక దర్శన ప్రభావాన్ని తెలియజేసిన ఉత్తమ గ్రంథంగా అనేకమంది పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు విశ్వర్షి వాసిలి వసంత కుమార్ గారిని సదస్సులోని పాల్గొన్న ఆచార్యులు వక్తలు ఘనంగా సన్మానించారు. తదనంతరం 108 రోజులుగా పత్ర సమర్పణ చేసిన వారిని,  వివిధ సమావేశాలకు అధ్యక్షత వహించిన వారిని ప్రత్యేకంగా సత్కరించారు. 


సత్కారాలకు ముందు జరిగిన సమావేశంలో విశ్వర్షి డా. వాసిలి వసంతకుమార్ గారు  తాత్త్వికమైన రచనలు చేసేవారనీ, వాటిని చదవటం ద్వారా ఆయన రచనలపై ఆసక్తి పెరిగిందనీ, ఆ తరువాత కొన్నాళ్ళకు ఆయన నేను అనే  పేరుతో యౌగిక కావ్యాన్ని సిరికోన వాట్సాప్ గ్రూప్ లో రాస్తుండేవారనీ, అప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడిందనీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు  చెప్పారు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు  ఈ సమావేశంలో ఇంకా మాట్లాడుతూ  " డా. విశ్వర్షి వాసిలి రాసిన నేను అనే యౌగిక కావ్యంలో శాస్త్రీయత, తాత్వికతల సమ్మేళనం కనిపించే గొప్పకావ్యం. ఆ కావ్య చదివిన తర్వాత ఆయన యోగా, ప్రాణాయామం పై చేస్తున్న కృషి గమనించిన తర్వాతా, ఆయన రచనలను చదివిన తర్వాతా నాకు భారతదేశ తాత్విక లోతులు మరింతగా తెలిశాయి. విశ్వర్షి వాసిలి వసంత కుమార్ గారి కృషి అసామాన్యమైనదనిపించింది. ఆయన చేసే బోధనలలో తాత్వికత, శాస్త్ర విజ్ఞానం కలిసి ఉంటాయి. అది వింటున్నప్పుడు ఈదేశంలో ఒక భారతీయుడుగా జన్మించినందుకు తన దేశ గొప్పతనానికి ప్రతి పౌరుడు ఒక ఉద్వేగానికి గురవుతాడు. ఆ విధంగా నేను కూడా ఒక భారతీయుడిగా ఇక్కడ పుట్టినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఆయన నాకు పరిచయమైనందుకు కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన రాసిన నేను  యౌగిక కావ్యం పై నేను కూడా అంతర్జాతీయ సదస్సులో మాట్లాడాను. దానిపై నేను రాసిన వ్యాసాల్ని ప్రచురించాను.  నాలాగే ఆయన రచనలపై అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న వారెందరినో ఈ సమావేశంలో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వీరంతా భారతీయ తాత్వికతను ప్రపంచ దేశాలకు ఈ అంతర్జాతీయ సదస్సు ద్వారా తెలియజేశారు. ప్రపంచ తాత్వికతతోను తొలినాత్మకంగా పరిశీలన చేసి మాట్లాడారు. అలా మాట్లాడిన వారంతా మూడు తరాలకు చెందిన వారిగా మనం వారిని వర్గీకరించుకోవచ్చు. ఒకటి ఫిలాసఫీని బాగా చదువుకుని ఆధ్యాత్మికతను జీవిత అనుభవాల నుండి చెప్తూ కొత్త దర్శనాన్ని ప్రపంచానికి ఈ సదస్సు ద్వారా తెలియజేసిన ఒక తరం. అది పెద్దవాళ్ల తరం. రెండవ తరం అటు వయసులో వృద్ధులూ కాదు.  యువకులూ కాదు. మధ్య వయసులో ఉన్నటువంటి వారు. అంటే నాలాంటి వాళ్ళు. కొంత తెలిసి తెలియనితనం తెలుసుకోవాలని ఆరాటం రెండింటి మధ్య సంఘర్షణతో సందిగ్నంలో ఉన్నటువంటి తరం వాళ్ళను కూడా వాళ్ళ అభిప్రాయాలను ఈ సదస్సులో పంచుకోమని చెప్పారు. ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధక విద్యార్థులు కూడా ఉన్నారు. వారిలో కొంతమంది ఈ సదస్సులో పత్ర సమర్పణ చేసిన వారు కూడా ఉన్నారు. అదిగో ఇక్కడే  సుజన, అనిల్ కుమార్, భాను పావని... వీళ్ళంతా ఈ మూడవ తరానికి ప్రాతినిథ్యం వహించే యువతరం. మూడు తరాలను నడిపించింది. ప్రసరించాలంటే ఈ రకమైన ఆలోచన ఉండాలి. అది ఈ అంతర్జాతీయ సదస్సు ద్వారా నెరవేరిందని నేను అనుకుంటున్నాను. నిర్వాహకులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా'' అనిఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.


ఇదొక విశ్వవిద్యాలయం వలే ఉందని ప్రసిద్ధ పరిశోధకులు డాక్టర్ రేవూరి అనంతపద్మనాభరావు వ్యాఖ్యానించారు.

ఈ సమావేశంలో ఆచార్య టి.గౌరీ శంకర్,ఆచార్య పులికొండ సుబ్బాచారి, ఆచార్య వెలుదండ నిత్యానందరావు, ఆచార్య డి విజయలక్ష్మి డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు,ఆంధ్ర ప్రదేశ్ తెలుగు మరియు సంస్కృత అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ డా.సిహెచ్.  సుశీలమ్మ, అత్తలూరి విజయలక్ష్మి, పి.యల్ . ప్రసాద్

దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యంపై ఉత్తమ పరిశోధన చేసిన డా.నిడమర్తి నిర్మల గారితో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు


ఆచార్య పులికొండ సుబ్బాచారిగారు, ఆంధ్రప్రదేశ్ తెలుగు మరియు సంస్కృత అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ డా.సుశీలమ్మగారితో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు



, డా.వజ్జల రంగాచార్య, వి.ఆర్ విద్యార్థి, డా. నిడమర్తి నిర్మలాదేవి, శ్రీమతి లలితా భాస్కరదేవ్, డా. డా.నాళేశ్వరం శంకరం,డాక్టర్ కమలాకర్ శర్మ డాక్టర్ నాళేశ్వరం శంకరం, శ్రీమతి నార్లంక మంజుల శ్రీమతి శ్రీలత, శ్రీమతి లలిత భాస్కర్ దేవ్, ప్రఖ్యాత చిత్రకారుడు , సినీ దర్శకుడు ఉలి, నేను యోగిక కావ్యానికి చిత్రాలు వేసిన చిత్రకారుడు జింకా, కృష్ణమోహన్, కృష్ణ చైతన్య, డాక్టర్ పావని డాక్టర్ అనిల్ కుమార్ కే సుజన, నల్లసాని రాంప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


No comments: