అనుబంధాలు
మన కాళ్ళు బాగున్నంతవరకూ
మనం రోజూ ఎక్కే మెట్లెన్నో తెలియవు
మన కళ్ళు బాగున్నంత వరకూ
మన చుట్టూ ఉన్న అందం విలువా తెలియదు
మన చెవులు వినిపించినంతవరకూ
ప్రకృతి పిలిచే సుమధుర సంగీతం వినపడదు
మనకన్నీ బాగున్నన్నాళ్ళూ
మనవాళ్ళ విలువా తెలియదు
ఇవన్నీ తెలిసేసరికి
అవన్నీమనకందకుండా పోవడమే విచిత్రం!
- దార్ల వెంకటేశ్వరరావు, 5.5.2022
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి