అమ్మా నేనింకా పసిమొగ్గనేకదా
నేనిలా రూపొందడానికి విసిగిస్తూ
నిన్నెంతగానో విసిగించిందీనిజమే
అప్పుడప్పుడూ ఊపిరాడక
ఆ ఒంటరితనంతో పోరాడలేక
నిన్నెంతగానో తన్నిందీ నిజమే
అందుకని నన్నిలా ఒంటరిగా
నడిరోడ్డుమీద వదలేసిపోతుంటే తెలుస్తుంది
ఆనాటిది ఒంటరితనం కాదనీ
ఒక అందమైన పూలవనంలో
నువ్వెంత రక్షణకవచమయ్యావోనని!
అమ్మా
నన్నిలా ఒంటర్నిచేసి నన్నొక అనాథను చేసి
పడిరోడ్డుమీదిలో వదిలేసిపోవద్దు
అమ్మా
నేనీప్రపంచంలోకి రాకముందేమో
నీ చేతుల స్పర్శ తాకినప్పుడల్లా
నీ బంగారు చేతుల్లో వాలిపోవాలని
చెప్పడమెలాగో తెలియక
నిన్నెంతగానో తన్నిందీ నిజమే
అదిగో చూడు
ఆకలేస్తుందేమోనని కలతిరుగుతన్నాడంటే
కాదమ్మను త్వరగా చూడాలనీ
నీ ముఖమ్మీద ముద్ధులుపెట్టాలనీ
బయటకు రావాలనీ నీతో చెప్పాలనిపించేది
నిన్నెప్పుడూ విసిగించను
మళ్ళీ ఆ సువర్ణ సాగరంలో కే పంపించెయ్
నన్నిలా ఒంటర్నిచేసి
నన్నొక అనాథను చేసి మాత్రం
నడిరోడ్డుమీద వదిలేసిపోవద్దు
నాన్నా…నువ్వైనా చెప్పు
నీ చెయ్యి పట్టుకుంటే
నన్నవ్వెరేమీచేయలేరనే నా ఆత్మవిశ్వాసాన్ని
నా కళ్ళల్లో చూడలేదా నాన్నా!
….
(అసంపూర్ణం…)
-దార్ల వెంకటేశ్వరరావు 9.6.2022
(బాబుని నడిరోడ్డు మీద వదిలేసి వచ్చినట్టు వచ్చిన ఒక భయంకరమైన కల పెట్టిన కలవరంతో…కన్నీళ్ళతో…)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి