"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

12 మార్చి, 2022

HCU తెలుగు శాఖ పరిశోధక విద్యార్థులకు విజ్ఞప్తి

 


*

 మీరు వివిధ జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొంటున్నారు. అందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు సమర్పించిన పరిశోధన పత్రాలు ప్రత్యేక సంచికలలో వచ్చాయి.  వీటితోపాటు వివిధ పత్రికలలో మీ వ్యాసాలు  ప్రచురించారు. ఈ వివరాలను మీ పరిశోధక ప్రగతి నివేదికల్లో పేర్కొన్నారు. వీటిని మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు పరిశీలించి మంచి పరిశోధన పత్రానికి  పది వేల రూపాయల నగదు బహుమతి ఇస్తున్న సంగతి కూడా మీకు తెలుసు. ఇప్పటికే ఈ విభాగంలో *శ్రీపతి మారుతి తన వ్యాసానికి పదివేల రూపాయల నగదు పారితోషికాన్ని అందుకున్నాడు* 

మీరు పాల్గొన్న సదస్సులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు/ వ్యాసాలు/ ఆహ్వానం పత్రాలు, ఈ నెల 15 వ తేదీ లోపుగా మీ రీసెర్చ్ సూపర్వైజర్ గార్కి లేదా శాఖాధ్యక్షులకు సమర్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వీటిని ఈ నెల 21 వ తేదీన వస్తున్న న్యాక్ కమిటీ కి చూపించిన తర్వాత, మరలా మీ పత్రాలు/ ధ్రువీకరణ పత్రాలు వాపసు తీసుకోవచ్చు. దీనిలో అర్హమైన పరిశోధన పత్రాలను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు ఇచ్చే పరిశోధన ప్రోత్సాహక గ్రాంటుకి కూడా సిఫార్సు చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను.

*గమనిక*: 2021 నుండి  2017 మధ్య కాలంలో  తమ కోర్సులు పూర్తి చేసిన వారు కూడా పైన చెప్పిన వివరాలను NAAC వారి పరిశీలన నిమిత్తం మన తెలుగు శాఖ అధ్యక్షుల ఈమెయిల్ headtelugu@uohyd.ac.in కు పంపి, మన విశ్వవిద్యాలయం సాధించబోయే అత్యుత్తమ గ్రేడ్ లో మీరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షుడు,. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు


*

కామెంట్‌లు లేవు: