*గురువుగారికి కృతజ్ఞతతో.....
ఆ.వె. ప్రియకవియని మీరు ప్రేమగా పిలవగా
మావితావి తోడ మనసు నిండె
తేనె పిలుపు నాకు తేనీళ్ళ చవియయ్యె
కావ్య రచన కై నొక కవి పుట్టె
తే.. మొక్కల కొరకు రోదించె మొగులు మీరు
వికట సమయాన దిశచూపె వెలుగు మీరు
నారును సమృద్ధిపరిచే ఎరువు మీరు
గొప్ప జ్ఞానమునందించె గురువు మీరు
--మీ శిష్యుడు అంబాదాస్...🙏🙏
13.9.2021
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి