హాయ్... మాది అమలాపురం దగ్గర విలసవిల్లి.ఈరోజు మా అబ్బాయి శంకర్ కి దార్ల వేంకటేశ్వరరావు అనే ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పాను.skbr నుంచి hcu వరకూ నాకు తెలిసిన ప్రస్థానం గురించి చెప్పాను.ముఖ్యంగా నేను hyd వచ్చినప్పుడు వచ్చిన వాన...
ఆ వానలో నా సైకిల్..
నన్ను ఎక్కించుకుని హోరుగాలివాన లో..
అంత వానలోనూ శరీరం కక్కుతున్న చెమట,
నా బరువు కు దార్ల నోట నుండి ముక్కు నుంచి వస్తున్న సెగలు...ఒకటి కాదు రెండు కాదు ముప్పై కిలోమీటర్ల ప్రయాణం... ఇవన్నీ చెప్పాను.
దార్ల కష్టం.. చదువు పై ఇష్టం...
కలసి నేసిన శాలువా గా నేటి స్థితి... ఇవన్నీ చెప్పాను.దార్ల అనుమతి లేకుండానే దార్ల విజయగాథ శంకర్ కి చెప్పాను.ఈకథ శంకర్ కు బాగా నచ్చింది. అనుకోకుండా నెంబర్ దొరికింది.చాలా సంతోషంగా ఉంది.
ఇట్లు..
విశ్వనాథ్.🙏🙏🙏

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి