"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

18 జులై, 2021

శ్రీహరి మూర్తికి ఈ యేడాది (2021) డా.జ్ఞానానందకవి పురస్కారం

వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారికి  ప్రతి యేడాదీ ఇచ్చే  పద్మశ్రీ డాక్టర్ జ్ఞానానందకవి సాహితీ పురస్కారాన్ని ఈ యేడాది అనంతపురానికి చెందిన రచయిత, పాత్రికేయుడు శ్రీ సాకే శ్రీహరిమూర్తికి ప్రదానం చేయనున్నట్లు జ్యోత్స్నాకళాపీఠం వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ మాజీ డీన్ ఆచార్య శరత్ జ్యోత్స్నా రాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.    ఈనెల 16 వతేదీ డా.జ్ఞానానందకవి 99వ జయంతి సభలో రూ.5116 లో నగదు, ప్రశంసాపత్రంతో సత్కరిస్తారని వెల్లడించారు.  పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో వైస్ ఛాన్సలర్ ఆచార్య పి. కిషన్ రావు, మాజీ రిజిస్ట్రార్ ఆచార్య టి.గౌరీశంకర్, సాధన నరసింహాచార్యులు, కళాజనార్ధనమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, హెచ్ సి యూ తెలుగు శాఖాధిపతి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు  డాక్టర్ జ్ఞానానందకవి సాహిత్యంపై ప్రధాన ప్రసంగం చేస్తారని తెలిపారు.




















కామెంట్‌లు లేవు: