"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

26 జూన్, 2021

ఒక్క సెల్ఫీ ప్లీజ్ !

మహానటి చలనచిత్రంలో జరిగిన సన్నివేశంలాంటిది ఒకటి నాకు నిన్న(25.6.2021వ తేదీన) ఎదురైంది. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ వికారాబాద్ నుండి హైదరాబాద్ వస్తున్నాం. నవాబ్ పేట దాటిన తర్వాత ఆర్టీఏ వాళ్ళు వాహనాల్ని ఆపి, అన్నీ చెక్ చేస్తున్నారు. నేనూ క్రిందికి దిగాను.e- challans చెక్ చేస్తున్నారు. నా కారుదీ చెక్ చేశారు. నాకూ ఫైన్స్ ఉన్నాయని తెలిసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాను. రాంగ్ పార్కింగ్, రాష్ డ్రైవింగ్...ఆ వివరాలు చూపించారు. అందరూ పెట్టుకొనే చోటనే నేనూ పెట్టాను కదా...అనేశాను అప్రయత్నంగా. వాళ్ళందరికీ ఇలాగే పడుతుంటాయన్నారు ఒక వెకిలి నవ్వు రువ్వుతూ. ఆ రాష్ డ్రైవింగ్ కి ఫోటో తప్ప వివరాలేవీ లేవు. ఈ మధ్య రోడ్డు మీద ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఇంచుమించు ప్రతీకారునీ, ప్రతీ వెహికిల్ నీ ఎందుకలా ఫోటోలు తీస్తున్నారో అని అప్పుడు తలబాదుకున్నా అర్థం కానిది ఒక్కక్షణంలో అర్ధమైందిప్పుడు. బాధంటే  ఏమిటో అనుభవిస్తేనే బాగా తెలుస్తుందని అందుకే అంటారేమో. అయినా ఒక సారి  నిలదీసి అడిగేద్దామనిపించింది. రాష్ డ్రైవింగ్ ఫోటోలో ఏమికనిపిస్తుంది. వీడియో చూపించమందామా...అనుకునే మరలా  సరే...పెంటమీద రాళ్ళేసుకోవడం ఎందుకులే అంటూ ఆత్మారాముడు చేసిన బోధతో ఫైన్
కట్టేశాను.  అప్పుడు ఒక కానిస్టేబుల్ నాదగ్గరకొచ్చి '' సర్...నేను ఎస్ .ఏ. పి.లో  మీ స్టూడెంట్ ని. చాలా రోజుల తర్వాత కనిపించారు. అప్పుడప్పుడూ మిమ్మల్ని పేపర్ లో చూస్తుంటాను. మావాళ్ళకి ఆ ఫోటో చూపించి మాసార్ అని కూడా చెప్తుంటాను. ఈ సారి ఫోటో చూపిస్తాను. ఒక్క సెల్ఫీ ప్లీజ్ సార్' అని మెరుస్తున్న మొహంతో ప్రేమగా అన్నాడు. అతన్నేమేనాలో నాకర్థంకాలేదు. ఒక బలవంతపు సెల్పీలో, తెచ్చిపెట్టుకున్న నవ్వుని పులుముకొని ఆ సెల్ఫీలో ఫోటో తీసుకోమన్నాను.  ''నేను..ఆ..పోలీస్ స్టేషన్ లో చేస్తున్నాను సర్...మీరెప్పుడన్నా...'' ఇంకా ఏదో చెప్తున్నాడు. ఆ పోలీసు బృందం నన్నూ, నేను వాళ్ళనీ చూసుకొంటూ, ముసిముసిగా, ముసిముసిగా నవ్వుకుంటూ కారెక్కేసాను.
ఇంతకీ...ఆ సినిమాలో ఇన్ కమ్ టాక్స్ వాళ్ళు  సావిత్రి గారి ఆస్తులన్నీ సీజ్ చేసి వెళ్ళిపోతూ ఆమె తమ అభిమాని అని ఒక ఆటో గ్రాఫ్ తీసుకుంటాడు. అది గుర్తొచ్చింది!
అయినా, అతడేమి చేస్తాడు...పై అధికారులు చెప్పిన డ్యూటీ చెయ్యాలిగా!  ప్రభుత్వానికి మాత్రం భలే ఇన్ కమ్ సోర్స్ దొరికిందిలే...అనుకుంటూ, ఇకపై జాగ్రత్త పడాలనుకుంటూ వచ్చేశాను.
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 26.6.2021

కామెంట్‌లు లేవు: