"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

17 మే, 2021

ఆచార్య కె.కె.రంగనాథాచార్యులుగార్కి నివాళి

కీ.శే.ఆచార్య కె.కె.రంగనాథాచార్యుల సంతాప సభలో మాట్లాడుతున్న తెలుగు శాఖ, సెంట్రల్ యూనివర్సిటీ అధ్యాపకులు



ఆచార్య జి.అరుణకుమారి (తెలుగు శాఖ అధ్యక్షులు)

ఆచార్య ఎస్.శరత్ జ్యోత్స్నారాణి


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

ఆచార్య విజయలక్ష్మి
డా.డి.విజయకుమారి

ఆచార్య జి.అరుణకుమారి
ఆచార్య పిల్లలమర్రి రాములు

ఆచార్య పమ్మి పవన్ కుమార్
డా.బి.భుజంగరెడ్డి
ఆచార్య తుమ్మల రామకృష్ణ

 కీ.శే.ఆచార్య కె.కె.రంగనాథాచార్యులు గారు 15.5.2021 న మరణించారు


సాహిత్య నిబద్ధతకు నిదర్శనం ఆచార్య కెకెఆర్

నిరాడంబరతకు, నియమబద్ధతకు, ఉత్తమ బోధనకు, పరిశోధన, సాహిత్యం పట్ల ఉన్న గాఢత, స్ఫష్టతలకు, భావజాలం పట్ల నిబద్దతకు నిదర్శనం ఆచార్య కె.కె.రంగనాథాచార్యులు అని వక్తలు నివాళులు అర్పించారు. హెచ్ సి యూ తెలుగు శాఖాధిపతిగా, మానవీయ శాస్త్రాల విభాగం డీన్ గా పనిచేసి, పదవీవిరమణ చేసిన విశ్రాంత ఆచార్యులు ఆచార్య కె.కె.రంగనాథాచార్యులు (80 సంవత్సరాలు) శనివారం నాడు కోవిద్-19 తో మరణించారు. ఈ సందర్భంగా తెలుగు శాఖాధ్యక్షురాలు ఆచార్య జి.అరుణకుమారి అధ్యక్షతన సోమవారం నాడు అంతర్జాలం ద్వారా సంతాపసభను నిర్వహించారు. ఆచార్య కె.కె.రంగనాథాచార్యులు తో తమకున్న అనుబంధాన్ని, ఆయన సాహిత్య నిబద్ధతను, పరిశోధనను ఈ సమావేశంలో పాల్గొన్న ఆచార్య తుమ్మల రామకృష్ణ ( వైస్ ఛాన్సలర్, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం), మాజీ డీన్ ఆచార్య ఎస్. శరత్ జ్యోత్స్నా రాణి, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య పమ్మి పవన్ కుమార్, ఆచార్య డి.విజయలక్షి,  డా.డి.విజయకుమారి, డా.బి.భుజంగరెడ్డి విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. 

కీ.శే.ఆచార్య కె.కె.రంగనాథార్యుల గారి సంతాప సభను సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ వారు ది.17.5.2021 న నిర్వహించారు. 


తెలుగు శాఖ, సెంట్రల్ యూనివర్సిటీ వారు ది.17.5.2021 వతేదీన కీ.శే.ఆచార్య కె.కె.రంగనాథాచార్యుల సంతాప సభలో మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు



2008లో ఆచార్య కె.కె.రంగనాథాచార్యులగారితో దార్ల వెంకటేశ్వరరావు


కామెంట్‌లు లేవు: