వినిపించినా
వినిపించనట్లు
ఎక్కడో
రెక్కలు విరుగుతున్నచప్పుడు!
దూరం దగ్గరై
దగ్గర దూరమైనట్లు
ఎక్కడో
అదృశ్యమవుతున్న దృశ్యం!
చెప్పి చెప్పి
నొప్పిని ఒప్పగించనన్నట్లు
ఎక్కడో
మెప్పించలేకపోతున్న శబ్దం!
జోలపాడుతూ
రాలిపోతూ జ్ఞాపకాలు
ఎక్కడో
తానే ఒక జ్ఞాపకమైపోవడం!
- దార్ల వెంకటేశ్వరరావు , 17.4.2021
(కరోనాతో మరణిస్తున్న వారికి నివాళినర్పిస్తూ!)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి