ఓటు అనేది ప్రజాస్వామ్యవ్యవస్థలో పౌరుడు తనని పరిపాలించమని ఐదేండ్ల పాటు ఒక ప్రతినిథికి ఇచ్చే ఒప్పందం వంటిది. ఇలా తమ ప్రతినిధిని ఎన్నుకొనే అవకాశం కోసం ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నారు. కొన్ని దేశాల్లో స్త్రీలకు, కొన్ని వర్గాలకు నేటికీ ఓటుహక్కు లేదు.ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్క రక్తపు బిందువు చిందించకుండా గెలవడానికి చేసే నిశ్శబ్దయుద్దంలో పాల్గొంటున్నారని గుర్తెరగాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకునేకంటే ముందే జాగ్రత్త పడాలన్నట్లు కుల, వర్గం, ప్రాంతీయ ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కుతో ప్రజాస్వామ్యానికి మరింత శక్తినిచ్చే నిజమైన నాయకుల్ని ఎన్నుకోవాలి. అక్షరరూపం దాల్చిన సిరా చుక్క లక్షమెదళ్ళకు కదలిక అన్నట్లే, ఒక్క క్షణంలో వేసే ఓటు ముద్ర లక్షలజీవితాల్ని శాసిస్తుందని గుర్తించాలి. .... ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు ప్రొఫెసర్, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి