ఒక రచనలో చిత్రమైన వ్యక్తుల మానసిక చిత్రణను మనం సాధారణంగా పాత్ర చిత్రణ అంటాం.
ఆ పాత్రల్ని కథ నడిపించే కథారచయిత ఒక సమాజానికి ప్రాతినిథ్యం వహించేటట్లు పాత్రలను సృష్టిస్తాడు.
పాత్ర లేకుండా కథ గానీ, నవల గానీ ఉండదు. అయితే వాటిలో శాశ్వతమైన ప్రభావాన్ని వేయగలిగినట్లుగా ఆ పాత్రను తీర్చిదిద్దారా? లేదా అనేదే ముఖ్యం. అలా ప్రభావం చూపిన కొన్ని పాత్రలు మన తెలుగు నవలల్లో ఉన్నాయి.
అసమర్థుని జీవ యాత్రలో సీతారామారావు, చివరికి మిగిలేది లో దయానిధి , అంపశయ్య లో రవి మొదలైన పాత్రలు పేర్కొనబడినది.చలం నవలల్లో రాజేశ్వరి, అమీర్, మీరా , అమీనా...కేశవరెడ్డి అతడు అడవిని జయించాడు లో ముసలివాడు, మునెమ్మ లో మునెమ్మ...
చిలుకూరి దేవపుత్ర...పంచమంలో...శివయ్య, పురుషోత్తం, అందులో చందమామ లో చిన్నోడు...
ఈ పాత్రలో ప్రధాన పాత్ర లేదా కథానాయకుడు, కథానాయిక, ప్రతినాయకుడు తర్వాత సహాయక పాత్రలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. మన విమర్శకులు పాత్రలను ఇంగ్లీషులో ఫ్లాట్ క్యారెక్టర్స్ అనీ, అంటే మార్పు లేని పాత్రలు, రౌండ్ క్యారెక్టర్స్ అంటే మార్పు చెందే పాత్రలు అని ప్రధానంగా రెండు రకాలుగా విభజించారు. ఈ పాత్రలను మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ పాత్రల స్వరూప స్వభావాలు వచ్చినటువంటి మార్పులను బట్టి ఈ లక్షణాలను గుర్తించారు. నిజానికి పాత్ర అనేది రచయిత ఆలోచనా విధానం లేదా రచయిత చెప్పదలచుకున్న భావజాలాన్ని బట్టి రూపొందుతుందని అహమనం పాత్రల రూపకల్పనను బట్టి చెప్పవచ్చు. అందుకని పద్యంలో కనిపించే పాత్రలన మూడు రకాలుగా విభజించుకునే అవకాశం ఉంది. మొదటి రకం పాత్రలలలో రచయితలే ఆ పాత్రల స్వరూప స్వభావాలు వర్ణిస్తూ ఆ పాత్రలను ప్రవేశ పెడుతూ ఉంటారు. రెండవ రకం పాత్రలలో రచయితలే ఆ స్వరూప స్వభావాలను ఎక్కడా వర్ణించకుండా పాఠకులే వాటి స్వరూప స్వభావాలను తెలుసుకునేలా సంభాషణల ద్వారా లేదా పాత్రలు నడిచిన తీరుతెన్నుల ద్వారా అవగాహన చేసుకునేటట్లుగా చేస్తారు. మూడో రకం పాత్రలు ఈ రెండు స్వభావాలను మిళితం చేసుకుని రూపొందుతూ ఉంటాయి. మొదటి రకం పాత్రలు ఎక్కువగా విశ్వనాథ సత్యనారాయణ నవల లో కనిపిస్తాయి. రెండవ రకం పాత్రలు నవలలో ముఖ్యంగా చిలుకూరి దేవపుత్ర రాసిన నవలలో ఒక కనిపిస్తాయి. మూడో రకం పాత్రలు ఇంచుమించు అందరూ రచనల్లోనూ సహజం గా కనిపిస్తూ ఉంటాయి.
పాత్రల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అంటరాని వసంతం లో భూదేవి పాత్ర గురించి చదువుతున్నప్పుడు అటువంటి ఒక అత్తగారు లేదా మేనత్త ఒకరు మనకు కూడా ఉంటే బాగుంటుందనిపిస్తుంది. ఆమెకు దళితుల ఆడపడుచులల్లో కనిపించే తెగువ, ఆదరించే గుణం ఆ ప్రేమానురాగాలు పాఠకులను గుర్తుంచుకొనేలా చేస్తాయి. కళ్యాణ్ రావు గారు అంటరాని వసంతంలో మాలల సంస్కృతిని ప్రధాన కేంద్రంగా వర్ణించినా, మాలలు మాదిగలు క్రైస్తవీకరణ పొందిన విధానం దాంట్లో కనిపిస్తుంది. దీనిలో భూదేవి పాత్ర జాజుల గౌరి నవలలో నీలమ్మలో పరిపూర్ణం పొందినట్లనిపిస్తుంది. అలాగే ఎజ్రా శాస్త్రి గారు రాసిన మా ఎర్ర ఓబన్నపల్లి లో ముత్యాల పాత్ర కూడా ఒక మరిచిపోలేని పాత్ర. చిలుకూరి దేవపుత్ర రాసిన అద్దంలో చందమామ నవలలో చిన్నోడు పాత్ర ఆ తర్వాత తల్లి పాత్ర మరిచిపోలేని పాత్రలు. చిన్నోడు భార్య తన సుఖసంతోషాల కోసం అతన్ని వదిలేసి తన అమ్మగారింటికి వెళ్లి పోతుంది. అక్కడ ఒక అతను ఆమెను మాయమాటలు చెప్పి వేశ్యా గృహానికి అమ్మేస్తాడు. కొనుక్కోవడానికి చిన్నోడు ఒకరోజు పట్టణానికి వెళ్తాడు. అక్కడ ఒక రిక్షావాడి మాటల వల్ల వేశ్యా గృహానికి వెళడతాడు. ఆ వేశ్య గృహంలో తన భార్యను చూసి గుండె తరుక్కుపోయినంతపని అవుతుంది. ఆమె మరలా తన ఇంటికి తీసుకువస్తాడు. ఆమెని మరల ఆ కుటుంబం ముఖ్యంగా చంద్రుడు తల్లి అంటే లక్ష్యములు అత్తగారు ఎలాంటి కల్మషం లేకుండా ఆమెను మరలా దగ్గరకు చేర్చుకుని ఆదరిస్తుంది. ఈ పాత్రలను మనం మర్చిపోలేం. చిలుకూరి దేవపుత్ర అద్దంలో చందమామ రాసిన పది సంవత్సరాలకు కు పంచమం అనే నవల రాశారు. దానిలో ప్రధాన కథానాయకుడు ఒక మాదిగ కులానికి చెందిన శివయ్య ఎంతో కష్టపడి చదివి గ్రూప్ వన్ ఆఫీసర్ అవుతాడు. కానీ నిజాయితీగా పని చేసినా రాజకీయ అండదండలు లేక తన ఉద్యోగం కోల్పోతాడు. ఉప ముఖ్యమంత్రిగా మాదిగ కులానికి చెందిన వ్యక్తి ఉన్నప్పటికీ తన పదవిని కాపాడుకోలేక పోతాడు. దళితులు చైతన్యవంతం కాకుండా వారికి రాజ్యాధికారం వచ్చినప్పటికీ దాన్ని నిలుపుకోవడం ఎంత కష్టమో ఈ నవలలో చిలుకూరి దేవపుత్ర వాస్తవికంగా వివరించారు. దీనిలో శివయ్య ఎదగడానికి దళితుడైన పురుషోత్తం పాత్ర మనం మరిచిపోలేని పాత్ర. ఇలా దళిత నవలలో చిరస్మరణీయమైనటువంటి కొన్ని పాత్రలు ఉన్నాయి. ఇవన్నీ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. ఈ రచనలు, ఈ రచనల్లో ఉన్న ఈ పాత్రల సృష్టి తెలుగు నవలా సాహిత్యానికి కొత్త శక్తినిచ్చిందని చెప్పవచ్చు.
( ఢిల్లీ విశ్వవిద్యాలయం వారు 30.9. 20 20 వ తేదీన నిర్వహించిన అంతర్జాతీయ అంతర్జాల సదస్సు లో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడిన ప్రసంగం లోని ముఖ్య విషయాలు. ఈ సదస్సు నిర్వహించిన సంచాలకులు ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకులు డాక్టర్ వి వెంకట్రామయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి