సింగపూర్ ఎన్‌టియులో పరిశోధనలకు పెద్దపీట
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 28 July 2017
హైదరాబాద్, జూలై 28: సింగపూర్ నాన్‌యాంగ్ టెక్నాలజికల్ యూనివర్శిటీ (ఎన్‌టియు) పరిశోధనలకు పెద్ద పీట వేస్తోందని, భారతీయ విద్యార్ధులను దృష్టిలో ఉంచుకుని ఎన్‌టియు ఇండియా కనెక్టు పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు యూనివర్శిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి వి ఆర్ చౌదరి తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన శుక్రవారం నాడు పాల్గొన్నారు. ఫ్యాకల్టీ సభ్యులతో మాట్లాడుతూ ప్రస్తుతం తమ వర్శిటీలో 33వేల మంది విద్యార్ధులున్నారని, జలం, ఇంధనం, ఆరోగ్య సంరక్షణ అంశాలపై ప్రధానంగా పెద్ద ఎత్తున పరిశోధనలకు తాము ప్రోత్సహిస్తున్నామని, ఈ రంగాలపై ఆసక్తి ఉన్న విద్యార్ధులు తమ వర్శిటీలో చేరవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో విసి ప్రొఫెసర్ పి అప్పారావు , ప్రో విసి ప్రొఫెసర్ పి ప్రకాష్ బాబు, డిప్యూటి డీన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
( ఆంధ్రభూమి సౌజ్యంతో)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి