"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

09 జూన్, 2020

భయం తెరలు


ఇప్పుడెవర్ని చూసినా 
నా కళ్ళకు తగిలించుకున్న
అనుమానపు తెరలపై
కదులుతున్న భయం దృశ్యాలే!
నాకే తెలియకుండా
నన్నే మహమ్మారో మోహించినా
ఎప్పట్లాగే నాకోసం
నిరీక్షించి నిరీక్షించిన పేగుబంధం
నన్ను చూడగానే పరుగెత్తుకొచ్చి
ఒకవేళ మెడను చుట్టుకుంటుందేమో।
గుమ్మం ముందు నిలబడగానే 
నిలదీసే అంతరంగ తరంగదృశ్యం!
ప్రియంగా తెచ్చుకున్నవన్నీ
ఇంటికవతలే పెట్టేటంతటి భయం
నఖశిఖపర్యంతం స్నానం చేసి
ఇంట్లో అడుగు పెట్టినా
ఇంట్లోవాళ్ళందరి కళ్ళల్లోనూ
విషాదమేదో పులుముకున్నట్లనిపించే
అపరాధ భావనేదో కడుపుకోస్తున్నంత బాధతో కూడిన భయం!
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,           9.6.2020





కామెంట్‌లు లేవు: