"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

04 ఏప్రిల్, 2020

ఆ తల్లి జన్మమెంత ధన్యమయ్యె!

వాళ్ళు తల్లిని వీడని బిడ్డలు
తమని కనిపెంచిన అనుభూతి
వాళ్ళని ఎంత ఎదిగినా
వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా
తల్లిని వీడనివ్వని బంధమై
వెంటాడుతూనే ఉంటుంది
వాళ్ళు తమ ఊరు పొలిమేరలో అడుగుపెట్టినా
మెడను తిప్పుకోలేని లేగదూడలు
తాము పలికే మాటల్లో
తాము రాసే అక్షరాల్లో
తమ చదువులతల్లినే నిత్యం పలవరిస్తూ
మళ్ళీ తమ బిడ్డలకూ
ఆ తల్లి ఒడినే బడిని చేయాలని తపిస్తుంటారు.
ఆ తల్లికి ఎడబాటు లేదు
ఆ తల్లికి తడబాటు లేదు
తనను మించినట్టి తనయులనుకనిన
తల్లి జన్మమెంత ధన్యమయ్యె!
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
4.4.2020
(సెంట్రల్ యూనివర్సిటీ అడ్మషన్ నోటిఫికేషన్ రాగానే మా వాళ్ళంతా స్పందించిన తీరుకి సంతోషిస్తూ...!)

కామెంట్‌లు లేవు: