నువ్వు అవసరానికో నినాదమై
వాళ్ళగొంతుల్లో వినపడుతుంటావు
నువ్వు అవసరానికో ప్రదర్శన బొమ్మవై
వాళ్ళ చేతుల్లో కనపడుతుంటావు
నువ్వు అవసరానికో బలమైన వాదమై
వాళ్ళ అవసరాన్ని నిలబెడుతుంటావు
నా కంటే
మా కంటే
వాళ్ళే నిన్ను
బాగా అర్థం చేసుకున్నారన్నంతగా
మమ్మల్ని భ్రమపెడుతుంటారు
గొంతుదాటని మాటల్ని
గోడదాటినవెంటనే ఊసేస్తుంటే
నా గొంతు బొంగురుపోతోంది
అవసరం తీరగానే ఆవలపడేసి
వాళ్ళెవరినో దేవుళ్ళను జేసి
మొక్కుతున్న ఆ చేతులు చూస్తుంటే
నా కరములసహనపడుతుంటాయి
వాళ్ళకవసరం తీరగానే
ఆవలపారేసినా
నువ్వు మా జీవితమౌతావు
నువ్వు నా గుండె గుడిలో దేవుడివవుతావు!
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 8-2-2020
వాళ్ళగొంతుల్లో వినపడుతుంటావు
నువ్వు అవసరానికో ప్రదర్శన బొమ్మవై
వాళ్ళ చేతుల్లో కనపడుతుంటావు
నువ్వు అవసరానికో బలమైన వాదమై
వాళ్ళ అవసరాన్ని నిలబెడుతుంటావు
నా కంటే
మా కంటే
వాళ్ళే నిన్ను
బాగా అర్థం చేసుకున్నారన్నంతగా
మమ్మల్ని భ్రమపెడుతుంటారు
గొంతుదాటని మాటల్ని
గోడదాటినవెంటనే ఊసేస్తుంటే
నా గొంతు బొంగురుపోతోంది
అవసరం తీరగానే ఆవలపడేసి
వాళ్ళెవరినో దేవుళ్ళను జేసి
మొక్కుతున్న ఆ చేతులు చూస్తుంటే
నా కరములసహనపడుతుంటాయి
వాళ్ళకవసరం తీరగానే
ఆవలపారేసినా
నువ్వు మా జీవితమౌతావు
నువ్వు నా గుండె గుడిలో దేవుడివవుతావు!
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 8-2-2020
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి