భారతీయ తొలిమహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రి బాయి ఫూలే ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయురాలని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అన్నారు. గురువారం నెహ్రూనగర్ లో గల ఉర్ధూమీడియమ్ పాఠశాలలో జరిగిన సావిత్రిబాయి ఫూలే 189వ జయంతి సందర్భంగా చందానగర్ లో గల స్మిత డెంటల్ క్లినిక్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన తాడిబోయిన రామస్వామి యాదవ్, డా.శ్రీధర్ రెడ్డి పాల్గొని, టూత్ పేస్టులు, బ్రష్షులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులు డా.ఎం.మంజుశ్రీ, శ్రీమతి సి.గిరిజలను సావిత్రిబాయి ఫూలే పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రీ శివరామకృష్ణ, జి.వి.రావు, ఎం.ఎస్.నారాయణ, సత్యనారాయణ, రామచంద్రరావు, పాఠశాల ప్రధానోపాద్యాయురాలు శ్రీమతి బేగమ్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి