సాక్షి తెలుగు దినపత్రిక, 2 నవంబరు 2019 సౌజన్యంతో
తెలుగు భాషా, సాహిత్య పరిశోధనల్లో శాస్త్రీయ మైన పద్ధతుల్ని పాటించినప్పుడే వాటికి విలువ పెరుగుతుందని స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డీన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం సెంట్రల్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ లో తెలుగు భాషా, సాహిత్య పరిశోధకుల కోసం స్టూడెంట్స్ యూనియన్ '' తెలుగు పరిశోధన పద్ధతులు, సిద్ధాంత గ్రంథ రచనలో పాటించాల్సిన నియమాలు' అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రసంగ కార్యక్రమమంలో ఆయన మాట్లాడారు.దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న తెలుగు పరిశోధనలు తీరుతెన్నులను వివరిస్తూ చాలామంది కనీసం తాము పాటిస్తున్న శైలీపత్రమేదో కూడా తెలియకుండా పరిశోధనలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలుగు భాషా, సాహిత్య పరిశోధనకు ప్రస్తుతం ఏ.పి.ఐ., ఎం.ఎల్.ఏ. శైలీపత్రాల్ని అనుసరిస్తున్నారని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
సిద్ధాంత గ్రంథాన్ని రాసేటప్పుడు అవసరమైన చోట్లలో తప్పని సరిగా రిఫరెన్స్ ఇవ్వాలని, వాటిని ఇచ్చే వివిధ పద్ధతుల్ని వివరించారు. ప్రతి పరిశోధకుడు తప్పనిసరిగా తన పరిశోధన లక్ష్యాలను, పరిధినీ, ఫలితాంశాల్ని సిద్ధాంత గ్రంథంలో పేర్కొనాలని చెప్పారు. గ్రంథం చివరిలో ఉపయుక్త గ్రంథ సూచి, అనుబంధాలు పద్ధతి ప్రకారం రావాలన్నారు. స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ కౌన్సలర్ వెన్నెల, వాస గణపతిరావు, మీరజ్ గిర్, బోర్డు మెంబర్ రిదాజలీన్, విద్యార్థులు, పరిశోధకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నమస్తే తెలుగు దినపత్రిక, 2 నవంబరు 2019 సౌజన్యంతో
నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక, 2 నవంబరు 2019 సౌజన్యంతో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి