03 అక్టోబర్, 2019
బాపూజీ జీవితం ప్రపంచానికే ఆదర్శం (2 October 2019)
మహాత్మా గాంధీ జీవితం నేటికీ ప్రపంచానికే ఆదర్శనీయమైందని సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డీన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. మాదాపూర్ లోని స్వాతి ఉన్నత పాఠశాల లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం బాపూజీ 150 వ జయంతి వేడుకలు నిర్వహించి, పాఠశాల ఆవరణలో గల గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పాల్గొని, గాంధీజీ జీవితం, ఆయన చేసిన దేశసేవ, ఆయన ఆదర్శాలను వివరించారు. శాంతి, అహింసలను ప్రపంచానికి నేర్పించిన గాంధీజీ జీవితం ప్రతి విద్యార్థి, పౌరుడు తెలుసుకోవాలని అధ్యక్షోపన్యాసంలో రామస్వామి యాదవ్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు హింస పెరిగిపోతుందనీ, ఈ పరిస్థితుల్లో గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని పాటించడమే శాంతియుత జీవనానికి ఏకైక పరిష్కారమార్గంగా ఐక్యరాజ్యసమితి గుర్తించి, గాంధీజీ పుట్టినరోజుని అహింసా దినోత్సవంగా ప్రకటించిందని రామస్వామి యాదవ్ తెలిపారు. పాఠశాల కరస్పాండెంట్ శ్రీ వి. పణికుమార్, సూపర్ విజ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ పి. రామ్మోహన్ రావు, శ్రీ పాలం శ్రీను, బ్లూమ్స్ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ శ్రీయు. కిరణ్ కుమార్ తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొని గాంధీజీకి ఘనంగా నివాళులు అర్పించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి