'సాహితీ సౌగంధి' పుస్తకావిష్కరణ
ప్రముఖ కవి, విమర్శకుడు, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు రచించిన 'సాహితీ సౌగంధి' పుస్తకాన్ని శనివారం సాయంత్రం ప్రముఖ సాహితీవేత్త డా.ద్వా.నా.శాస్త్రి తన గృహంలో ఆవిష్కరించారు. తన శిష్యుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కావడం, మంచి రచయితగా పేరు ప్రఖ్యాతులు పొందడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా డాక్టర్ ద్వానా శాస్త్రి అన్నారు. తన అడుగుజాడల్లో మంచి సాహిత్య విమర్శకుడిగా వెంకటేశ్వరరావు అనేక వ్యాసాలను రాశారని, వాటితో పాటు అనేక గ్రంథాలకు పీఠికలు కూడా రాశాడని వాటిని సాహితీ సౌగంధి పేరుతో ప్రచురించారని ఆయన వివరించారు. సమకాలీన తెలుగు సాహిత్య తీరుతెన్నులను అవగాహన చేసుకోవడానికి ఈ గ్రంథం ఎంతగానో ఉపకరిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ గ్రంథ ఆవిష్కరణ సభలో తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ ఎం.మంజుశ్రీ, పరిశోధకులు ఎం.చంద్ర మౌళి , దారిశెట్టి పుష్ఫిణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి