03 సెప్టెంబర్, 2018
దార్ల వేంకటేశ్వరరావు జీవితం...ఒక పద్యం
దార్ల వేంకటేశ్వరరావు జీవితం!
సీసము:
పుట్టిపెరిగితిని పుష్కలముగనీరు
పారుగోదావరి ప్రాంతమందు
ఉన్నత విద్యపేరున్నహైదరబాదు
విశ్వవిద్యాలయవిశ్వమందు
ఉద్యోగ మొందితి నున్నత విద్యన
భ్యాసంబు చేసిన స్థలమునందు
కళ్యాణమాడితి కనుపాపగాచూచు
కొనుమానవీయను కోరుకొనియె
తే.గీ।।
దార్ల వేంకటేశ్వరరావు ధరణినందు
నాదునామంబు, నాగమ్మ నాకు తల్లి
కల్మషంబు నెరుగనట్టి కల్పతరువు
తండ్రి అబ్బాయి(లంకయ్య) ధర్మశీలి!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి