మదర్ థెరీసా
తండ్రిమరణమామెదగ్గరగాచూచి
దేహవిలువనామె తెలుసుకొనియె
పసిపాప
హృదయంబు పలుమార్లు విలపించి
విలపించి సత్యంబు తెలుసు కొనియె
తనజీవితంబునంతననాథలకనియు
మానవ సేవకే మలచు కొనియె
మదరుతెరీసాయె
మనకున్న మదరన్న
విశ్వమంతయుకీర్తి విచ్చుకొనియె
ఆ.వె.
అమ్మలేనివారికమ్మలామారుచూ
ఆదరించెనామె
అవతరించి
నట్టిదైవమోలె
నరజన్మవరమని
కరుణ
రూపమెత్తి కనికరించె !
(26 ఆగస్టు 2018 వ తేదీన
మదర్ థెరీసా జయంతి సందర్భంగా...)
-దార్ల వేంకటేశ్వరరావు, హైదరాబాద్.
మనం చేసే పనిని పవిత్రంగా చేసినప్పుడు, అది దైవకార్యంతో సమానమని సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డీన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మాదాపూర్ లోని స్వాతి ఉన్నత పాఠశాలలో జరిగిన మదర్ థెరీసా 109 వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మదర్ థెరీసా సామాజిక సేవను వివరించి, ఆమె జీవితం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి 'విశిష్ట సేవా రత్న' పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ రామస్వామి యాదవ్ అధ్యక్షత వహించి వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, దీనిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి