నమ్మకం
నడవడం నేర్పాక నమ్మకమే నడిపిస్తుంది
అపనమ్మకం భయపెడుతూతడబడేలాచేస్తుంది
గరికలాంటిపొరపాటుతాడులామారిపోతుంది
గమ్యం తెలియనప్పుడు
యెటుచూసినా అయోమయమే!
గమ్యంగుర్తించలేనప్పుడు యేదైనా దుఃఖమే!
గమ్యమెటో నిర్ణయించుకోలేనప్పుడు
నడవడం నేర్పాక నమ్మకమే నడిపిస్తుంది
అపనమ్మకం భయపెడుతూతడబడేలాచేస్తుంది
గరికలాంటిపొరపాటుతాడులామారిపోతుంది
గమ్యం తెలియనప్పుడు
యెటుచూసినా అయోమయమే!
గమ్యంగుర్తించలేనప్పుడు యేదైనా దుఃఖమే!
గమ్యమెటో నిర్ణయించుకోలేనప్పుడు
యేదిక్కుకెళ్ళాలో ఎలా తెలుస్తుంది!
అన్నిమార్గాల్ని అన్వేషించాలి
గమ్యంచేర్చేదేదో గుర్తించాలి
చీకటికుహరంలో
వెలుగుల ఊపిరిపోసిందెవరు?
పురిటినొప్పుల్నెవరుభరించారు?
అమ్మతనం నీగమ్యం గుమ్మందాకా రాకపోవచ్చు
నీగమ్యాన్ని దాటకుండా అడ్డుకునే
మోకాలడ్డుపెడుతుందా!
నమ్మకం నడిపిస్తుంది
అది నమ్మకమే అయితే అమ్మకానికెలాపెడుతుంది!?
నమ్మకమేనడిపిస్తుంది!!
-దార్ల వెంకటేశ్వరరావు
మనతెలంగాణ దినపత్రిక సాహిత్యం పేజీ, 6 ఆగస్టు 2018
అన్నిమార్గాల్ని అన్వేషించాలి
గమ్యంచేర్చేదేదో గుర్తించాలి
చీకటికుహరంలో
వెలుగుల ఊపిరిపోసిందెవరు?
పురిటినొప్పుల్నెవరుభరించారు?
అమ్మతనం నీగమ్యం గుమ్మందాకా రాకపోవచ్చు
నీగమ్యాన్ని దాటకుండా అడ్డుకునే
మోకాలడ్డుపెడుతుందా!
నమ్మకం నడిపిస్తుంది
అది నమ్మకమే అయితే అమ్మకానికెలాపెడుతుంది!?
నమ్మకమేనడిపిస్తుంది!!
-దార్ల వెంకటేశ్వరరావు
మనతెలంగాణ దినపత్రిక సాహిత్యం పేజీ, 6 ఆగస్టు 2018
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి