"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

31 July, 2018

మళ్ళీ నీ కోసమే ఈ నిరీక్షణ


31 జూలై 2018, మనం దినపత్రిక సౌజన్యంతో


నిద్రరాని ప్రతి అర్థరాత్రీ
 ఆకాశంకేసి చూసినప్పుడల్లా
నాఒంటరితనాన్ని పోగొట్టే
నక్షత్రమై పలకరించిన నిన్ను చూడాలనిపిస్తుంది.
నీకళ్ళల్లో నన్నూ నాకళ్ళల్లో నిన్నూ-
ఒకర్నొకరం మౌనసంగీతాన్ని వింటూ
మబ్బులచాటున చెఫ్పుకున్న
వేదనలయెరుపులన్నీ
మళ్ళీఈకళ్ళల్లోమెరిసేలానిన్ను చూడాలి
చూపులుకురుస్తున్నతడితో
ఆ కాగితప్పడవల్లో ఊగిసలాడుతూ
కొండలనుండీ కోనలనుండీ
తొంగితొంగిగెంతులేసే
సూర్యుణ్ణలాగే పిడికిళ్ళలోబంధించి
మనసుతెరచాపల్లో
 
దాగుడుమూతలాడుతూ గోడలకేసినపోస్టర్లు
నినాదాలైమోగినకదనరంగాన్ని
 
మళ్ళీ నీకళ్ళల్లో చూడాలి
ఇంటినిండా పరుచుకున్నవస్తువులే
అవసరమున్నా లేకున్నా కొన్న
ప్రపంచంలోని ఎన్ని వస్తువులో!
ఒక్కదానిలోనూ జీవకళకనిపించదే
ఒక్కరైనా కాసేపు మనసువిపిమాట్లాడరే
వాయిదాలముచ్చట్లు
ఆయుధాలుముచ్చట్లు
ఒక్కరైనా కాసేపు కళ్ళనైనా మరల్చరే
ఇడియట్ బాక్స్ కొకరు
 
ఆండ్రాయిడ్ పిక్స్ కొకరు
అంతబట్టని అంతరాంతర్జాలశోధన!
పొగగొట్టం కొట్టిన నామసిముఖాన్నిముద్దాడిన
ఆకుక్కపిల్లనువెతగ్గలిగే
నీసహాయపు జాడలు కోసమైనా నిన్ను చూడాలి
నలిగినహృదయాలాపాలవిలాపాలు
బూతులుగా మారినా,వాతలుగా మారినా
సహించి నన్నక్కున చేర్చుకొనే
 'అమ్మ'లాంటి నిన్ను మళ్ళీ చూడాలి!

-దార్ల వెంకటేశ్వరరావు, మొబైల్: 9182685231
(‘మనం’ దినపత్రిక, 31 జూలై 2018 లో ప్రచురితం)

No comments: