సదస్సులో పత్ర సమర్పణ చేస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, వేదికపై ఆచార్య వెలుదండ నిత్యానందరావు, డా.సాగి కమలాకరశర్మ, డా.ఏలే విజయలక్ష్మి, డా.జిలుకర శ్రీనివాస్ ఉన్నారు.
యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల, సికింద్రాబాద్ లో 7, 8 డిసెంబరు 2017 తేదీల్లో ఉన్నత
విద్యామండలి, తెలంగాణ రాష్ట్ర సంయుక్త ఆధ్వర్యంలో 'తెలంగాణ దళిత కథా సాహిత్యం-
సమాలోచన' పేరుతో రెండు రోజుల జాతీయ సదస్సు జరిగింది.
భారతరాజ్యాంగం ప్రకారం మాదిగలు అని పిలిచే కులస్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు
రాష్ట్రాల్లో షెడ్యూల్డు కులాల జాబితాలో ఉన్నారు. చనిపోయిన పశువుల తోలుతీసి
చెప్పులు కుట్టడం, డప్పులు చేయడం, తోలుతిత్తులు
చేయడం మొదలైన చర్మకారవృత్తులు చేసేవాళ్ళని ఒక నమ్మకం కొనసాగుతోంది. దీనితో పాటు
చావులకు, పెళ్ళిళ్ళకు డప్పులు కొట్టేవాళ్ళుగా కూడా
చెప్తుంటారు. చర్మకారవృత్తులు చేసేవాళ్ళను మాదిగలుగా పిలిచేవారు. కానీ, చరిత్రను జాగ్రత్తగా పరిశీలిస్తే, కేవలం
చర్మకారవృత్తులు మాత్రమే కాదు; మిగతా అనేక వృత్తుల్లో
మాదిగలు ఉన్నారు. ఆ యా వృత్తుల వల్ల పొందిన జీవితాన్ని కథల్లో ఎలా చిత్రించారనే
అంశమే ప్రధానంగా మాదిగ కథాసాహిత్యాన్ని విస్తృతపరుస్తోందని ఆచార్య దార్ల
వెంకటేశ్వరరావు అన్నారు.
తెలుగు శాఖ, యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయం, సికింద్రాబాద్ మరియు ఉన్నత విద్యామండలి, తెలంగాణ రాష్ట్ర సంయుక్త ఆధ్వర్యంలో 7,8 డిసెంబర్ 2017 తేదీల్లో జరుగుతున్న "తెలంగాణా దళిత కథా
సాహిత్యం-సమాలోచన" అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ‘‘‘మాదిగ
కథా సాహిత్యం- జీవన చిత్రణ’’ గురించి ఆచార్య దార్ల
వెంకటేశ్వరరావు పత్ర సమర్పణ చేశారు.
మాదిగ కథా సాహిత్యాన్ని గుర్తించేటప్పుడు మనం రెండు పద్ధతులను అనుసరించవలసి ఉంటుంది. మాదిగ రచయిత్రులు, రచయితలు రాసిన కథా సాహిత్యం, మాదిగేతరులు రాసిన కథా సాహిత్యం. మాదిగ రచయితలు, మాదిగేతరులు అని గుర్తించడానికి కొన్ని అవకాశాలున్నా, దానిలో పాటే మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మన జీవిత వివరాలు ముఖ్యంగా కుల వివరాలు తెలిస్తేనే వాటిని గుర్తించడానికి వీలవుతుంది. కొంతమంది తమ కులాన్ని చెప్పుకోరు. కానీ కులానికి సంబంధించిన సాహిత్యాన్ని రాస్తారు. అటువంటి వారు ఏ కులానికి చెందిన వాళ్ళో గుర్తించటం అంత సులభం కాదు. అందువల్ల నేను ఈ పత్రంలో మాదిగ రచయిత్రులు, రచయితలు రాసిన మాదిగ కథా సాహిత్యాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నాను. తెలంగాణ మాదిగ జీవితాన్ని కథలుగా రాసిన వాళ్లలో జూపాక సుభద్ర, జాజుల గౌరి, గోగు శ్యామల ప్రధానంగా కనిపిస్తారు. వీరితోపాటు ఎండ్లూరి సుధాకర్, డప్పోల్ల రమేశ్, పసునూరి రవీందర్, సిద్దెంకి యాదగిరి, ఐనాల సైదులు, వేముల ఎల్లయ్య, గుండెడప్పు కనకయ్య, ఎలమంద, సుధాకర్ అరూరి, ఎండ్లూరి మానస తదితరులు కూడా మాదిగ జీవితాన్ని చిత్రించే కొన్ని కథలను రాశారన్నారు.

సదస్సులో పాల్గొన్న పరిశోధకులు, విద్యార్థులు, అధ్యాపకులు
సదస్సులో పత్ర
సమర్పణ చేస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, వేదికపై ఆచార్య వెలుదండ
నిత్యానందరావు, డా.సాగి కమలాకరశర్మ, డా.ఏలే
విజయలక్ష్మి, డా.జిలుకర శ్రీనివాస్ ఉన్నారు.
జూపాక
సుభద్ర, గోగు శ్యామల ప్రధాన సంపాదకులుగా "నల్ల రేగటి సాల్లు"లోని కథలు మాదిగ జీవిత చిత్రణను వివరిస్తున్నాయన్నారు. అలాగే జూపాక
సుభద్ర రాసిన ‘శుద్ది చెయ్యాలె’, జాజుల గౌరి ‘కంచె’, డప్పోల్ల
రమేశ్ ‘అక్కర్లేదా’, పసునూరి రవీందర్ ‘
అవుటాఫ్ కవరేజ్ ఏరియా’ మొదలైన కథలను వివరించి,
వాటిలో చిత్రితమైన మాదిగ జీవన చిత్రణను విశ్లేషించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి