·
‘సాతవాహనుల నుండి కాకతీయుల వరకు
తెలంగాణ సాంస్కృతిక వికాసం’ గురించి సమీక్ష పునర్నిర్మాణం చేసుకొంటూ ఈ జాతీయ
సదస్సు జరుగుతోంది.తెలంగాణ చరిత్ర, భాష ,సాహిత్యం మొదలై వివిధ అంశాలను ఈ సదస్సులో చర్చిస్తున్నారు.
·
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు
తమది ప్రత్యేక సంస్కృతి అని చెప్పిన అంశాలను ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం
ఏర్పడింది.నిజానికి కొత్తగా ఒక దేశం ఏర్పడినా, ఒక రాష్ట్రం ఏర్పడినా పునర్నిర్మాణం అనేది జరగడం అవసరం.
·
సాధారణంగా తొలిదశలో కవుల
చరిత్రలు ఏర్పడతాయి. తర్వాత సాహిత్య చరిత్రలు, ఆ తర్వాత సాహిత్య వికాసం
చరిత్రలు రూపొందుతాయి.ఇప్పుడు తెలంగాణ భాష విషయంలో ఒక సంఘర్షణను, ఒక సందిగ్ధతను ఎదుర్కొంటుందని అనుకుంటున్నాను.
·
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పూర్వం
తమది ప్రత్యేకమైనటువంటి భాష అని చాలామంది ప్రకటించారు. దీన్ని కొంతమంది నిరూపించే
ప్రయత్నం కూడా చేస్తున్నారు. కొన్ని క్రియా పదాల్లోను, కొన్ని పదాలను ఉచ్ఛరించడంలో దీర్ఘాలు లేకపోవడం
అనేది తప్ప భాష పదజాలలో తెలుగు భాషకు తెలంగాణ భాషకు పెద్ద మార్పేమీ లేదని
అంటున్నారు. నిజానికి ఇప్పుడు ఇది ఒక
సవాలుగా నిలిచిందను కుంటున్నాను. పాఠ్యపుస్తకాలలో ఇప్పుడిప్పుడే తెలంగాణా భాష మీద
దృష్టి పెడుతున్నారు. అయినప్పటికీ కోస్తా ఆంధ్ర సరళ గ్రాంథికం ఇంకా పాఠ్య
గ్రంథాలలో కనిపిస్తోంది.
·
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన
తర్వాత మనం కొత్తగా ఎంత మంది కవులను పరిచయం చేసాం? కొత్తగా
ఎన్ని గ్రంథాలను పరిశోధించి బయటికి తెచ్చాం? అలాంటి అంశాల గురించి
నాలాంటి వాళ్లు ఆసక్తిగా ఎదురు చూస్తుంటాం. సుంకిరెడ్డి నారాయణరెడ్డి రాసిన
ముంగిలి తెలంగాణ ప్రాచీన చరిత్రలో పరిచయ మాత్రంగా ప్రస్తావించిన వారి గురించి
పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది.
·
ఆంధ్ర-తెలంగాణ రెండు ప్రాంతాలను
పరిపాలించిన పాలకులున్నారు. మొదట ఏ ప్రాంతాన్ని పరిపాలించారు? వారి మొట్టమొదటి రాజధానులు ఏవి? అంటే చారిత్రక
అంశాలను సాధ్యమైనంతగా నిర్ణయించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. వీటికి శాసన
ఆధారాలు ప్రమాణాలు అవుతాయి.
·
తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణంలో
శాసన పరిశోధకులు పాత్ర అత్యంత ముఖ్యమని అనిపిస్తోంది. చరిత్రను
పునర్నిర్మాణంలో విస్తృతమైన పరిశోధన అవసరం. ఇక్కడ పరిశోధకులు, చరిత్రకారులు సత్యనిష్ఠ ను పాటించడం అవసరం.
·
ఇంతకుముందు
జరిగిన ఒక ప్రాంతంవాళ్ళు చేసిన పొరపాటునే మళ్ళీ ఇక్కడ కూడా పునరావృతం చేయకుండా
ఉంటే భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తారనుకుంటున్నాను.
బహుశా ఈ అంశాలన్నింటినీ ఈ రెండు రోజుల జాతీయ సదస్సు లో సుదీర్ఘంగా చర్చిస్తారని భావిస్తున్నాను. ఇవన్నీ చరిత్ర, సాహిత్య పునర్మిర్మాణం దిశగా తెలంగాణ తొలి అడుగు గా భావిస్తున్నాను.
బహుశా ఈ అంశాలన్నింటినీ ఈ రెండు రోజుల జాతీయ సదస్సు లో సుదీర్ఘంగా చర్చిస్తారని భావిస్తున్నాను. ఇవన్నీ చరిత్ర, సాహిత్య పునర్మిర్మాణం దిశగా తెలంగాణ తొలి అడుగు గా భావిస్తున్నాను.
(తెలంగాణ సాహిత్య అకాడమి, వారధి సంస్థల ఆధ్వర్యంలో
సంయుక్తంగా 27, 28 అక్టోబరు 2017 తేదీలలో రవీంధ్రభారతి, హైదరాబాదులో ‘శాతవాహనుల
నుండి కాకతీయుల వరకు (చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం) అనే అంశంపై నిర్వహించిన
జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో ఆత్మీయ అతిధిగా
చేసిన ప్రసంగం సంక్షిప్త రూపం)
-ఫోటోల సౌజన్యం:ఎం.చంద్రమౌళి
-ఫోటోల సౌజన్యం:ఎం.చంద్రమౌళి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి