డా. అసిలేటి నాగరాజు ప్రధానసంపాదకత్వంలో, చిక్కా హరిష్ కుమార్ సంపాదకత్వంలో ‘‘ మేముసైతం’’ అనే పేరుతో వెలువరించిన కథాసంకలనాన్ని నిన్న (15 మార్చి 2015) రవీంద్రభారతి( మినీ కాన్ఫరెన్సుహాలు)లో ఆవిష్కరించి, పుస్తకపరిచయసభను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు ఆచార్య తుమ్మల రామకృష్ణ గారు. సభకు డా.పిల్లలమర్రిరాములుగారు అధ్యక్షత వహించారు. నేను (డా.దార్ల వెంకటేశ్వరరావు)ఆత్మీయ అతిథిగా పాల్గొన్నాను. పుస్తకాన్ని ఇంద్రవెల్లి రమేష్ గారు పరిచయం చేశారు. సభలో వికలాంగుల హక్కుల కోసం ఉద్యమాలు చేస్తున్న గంగారాంగారు, వికలాంగుల కోసం పత్రికను కూడా నిర్వహిస్తున్న రాజేంద్రగారు పాల్గొన్నారు. సభ జ్యోత్స్నాఫణిజ ప్రార్థనాగీతంతో ప్రారంభమైంది. మల్లేష్ వందనసమర్పణ చేశారు. సభలో డా.అసిలేటినాగరాజు, చిక్కాహరీష్ కుమార్ లు తమ స్పందనను తెలిపారు. నాగరాజు తల్లిదండ్రులకు, సోదరికీ, అలాగే చిక్కాహరీష్ సోదరికీ ఈ సందర్భంగా సభలో పాల్గొన్న అతిధుల చేతిమీదుగా సన్మానించారు. పుస్తకపరిచయ సభకు వచ్చిన అతిథులను నిర్వాహకులు తగిన రీతిలో సన్మానించారు. దీనితో పాటు ‘‘అవిటికథల’’పై పరిశోధన చేసిన బాలిరెడ్డిని, ఉస్మానియాలో పరిశోధన చేస్తున్న కుమారి ఉపేంద్రను కార్యనిర్వాహకులు సన్మానించారు. సభ చాలా ఆత్మీయంగా జరిగింది. ఈ సందర్భంగా నేను మాట్లాడిన మాటలు ఆడియో ఇక్కడ వినొచ్చు.
‘‘మేముసైతం’’ కథాసంకలనాన్ని ఆచార్య తుమ్మల రామకృష్ణగారు ఆవిష్కరిస్తున్న దృశ్యం
సభలో డా.దార్ల వెంకటేశ్వరరావుని సన్మానిస్తున్న దృశ్యం
సభలో పాల్గొన్న ప్రేక్షకులు
సభకు వచ్చేముందు ఆచార్య తుమ్మల రామకృష్ణగారితో డా.దార్ల వెంకటేశ్వరరావు
డా.దార్ల వెంకటేశ్వరరావుతో పోస్ట్ డాక్టోరల్ ఫెలో డా. వెంకటరమణ
డా.దార్ల వెంకటేశ్వరరావుతో పరిశోధక విద్యార్థి నాగరాజు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి