దళిత-ఆదివాసీ అధ్యయన మరియు అనువాద కేంద్రం, హైదరాబాద్
విశ్వవిద్యాలయం వారు ‘‘దళిత-బహుజన సాహిత్యం : చింతన –
సమాలోచన’’(నాగప్పగారి సుందరరాజు, కేసరాజు కొమరన్న, కలేకూరి ప్రసాదు, పైడి తెరేష్ బాబుల దృక్కోణాలు-చర్చా గోష్టి) పేరుతో ఒక సాహితీ
చర్చాగోష్టిని 26/02/2015 వ తేదీన హైదరాబాద్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, ఆడిటోరియంలో నిర్వహించారు.
ఈ సమావేశం నిర్వహించేముందు డా.జి.వి.రత్నాకర్ నాకు ఫోను
చేశాడు. సమావేశం వివరాలు చెప్పాడు. అయితే,‘‘ సందర్భానికి అనుగుణంగా ఉంటుందేమో నా
పుస్తకం ‘‘ బహుజనసాహిత్యదృక్పథం’’ ఆవిష్కరణ కూడా పెడదామా?’’ అన్నాను. ‘‘దీన్ని ఫ్రొఫెసర్ సర్రాజుగారు
నిర్వహిస్తున్నారు. ఇదిగో ఆయన్నే ఒకమాట అడుగు’’ అన్నాడు ఆయనకి ఫోనిస్తూ.
విషయం
చెప్పాను. ఆయన సంతోషంగా అంగీకరించారు. మర్నాడు నా పుస్తకం ఒక ప్రతిని ఆయనకి
అందించాను.
మీటింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది.
నా పుస్తకాన్ని ఈ సమావేశంలో ఆవిష్కరించడం చాలా
గౌరవంగా భావించాను.
పుస్తకాన్ని మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు
విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఫ్రొ.హరిబాబుగారు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో
శ్రీవేంకటేశ్వరవిశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఫ్రొ.కొలకలూరి ఇనాక్, మా
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ష్ ప్రొ. వి. కృష్ణ,
ప్రముఖపరిశోధకుడు, సిడాస్ట్ విజిటింగ్ప్రొఫెసర్, ప్రొ. జయధీర్ తిరుమల రావు, దళిత-ఆదివాసీ అధ్యయన-అనువాద కేంద్రం, హైదరాబాద్విశ్వవిద్యాలయం హెడ్ (ఐ/సి), ప్రొ. ఆర్.ఎస్. సర్రాజుగారు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సాక్షి, 27 ఫిబ్రవరి 2015
సమావేశంలో నా పుస్తకంతో పాటు కేసరాజు
కొమరన్న రాసిన వ్యాస సంపుటి “గుళ్ళ”, డా.జి.వి.రత్నాకర్ తెలుగు నుండి హిందీలోకి అనువదించిన కథల సంపుటి ‘‘
శ్రేష్ట్ దళిత్ కహానియా’’, జాజుల గౌరి రాసిన ‘‘ఒయినం’’
పుస్తకాలను ఆవిష్కరించారు.
ప్రారంభసమావేశంలో గోష్టి ప్రాధాన్యాన్ని ప్రొ.ఆర్.ఎస్. సర్రాజుగారు వివరించారు. నాగప్పగారి
సుందరరాజు, కేసరాజు కొమరన్న, కలేకూరి ప్రసాదు, పైడి తెరేష్ బాబు మొదలైన వారు చేసిన సాహిత్య,
సామాజిక ఉద్యమ దృక్కోణాలను సమావేశంలో పాల్గొన్నవారు సంక్షిప్తంగా వివరించారు.
నేటినిజం 4-3-2015
తర్వాత నాగప్పగారి సుందరరాజు, కేసరాజు కొమరన్న, కలేకూరి ప్రసాదు, పైడి తెరేష్ బాబుల గురించి విడివిడిగా సదస్సులు
జరిగాయి. జనం బాగా పాల్గొన్నారు.
కొమరన్న రాసిన ‘గుళ్ళ’ గ్రంథావిష్కరణ దృశ్యాలు
డా.జి.వి.రత్నాకర్ రాసిన పుస్తకం ఆవిష్కరణ దృశ్యం
జాజుల గౌరి రాసిన పుస్తకావిష్కరణ దృశ్యం
దార్ల వెంకటేశ్వరరావు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం
విద్యార్థులతో దార్ల
వేదికపై ఫ్రొ. ఎండ్లూరి గారితో డా.దార్ల
సభలో పాల్గొన్న కొంతమంది
దార్ల రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం
సుందరరాజు గురించి మాట్లాడుతున్న డా.దార్ల
నాగప్పగారి సుందరరాజు గురించి మాట్లాడుతున్న డా.దార్ల
ప్రారంభ సభలో కొంతమంది
ఫ్రొ. ఎండ్లూరి సుధాకర్, ఫ్రొ. శిఖామణి, శ్రీ కళ్యాణరావు, ప్రొ. తుమ్మల రామకృష్ణ, ప్రొ. కె. సునీత రాణి, డా. దార్ల వెంకటేశ్వర రావు,
శ్రీమతి. గోగు శ్యామల, బి.యస్. రాములు, డా. పిల్లలమర్రి రాములు, డా. కదిరె కృష్ణ, వేముల ఎల్లయ్య, డా. పసునూరి రవీందర్, బండి డానియల్, డా. కోయికోటేశ్వర రావు, జూపాక సుభద్ర, డా. జి. చంద్రయ్య, డా. సి. కాసిం, ప్రొ. గుండెడప్పు కనకయ్య,డా. జి.వి. రత్నాకర్, డా. యం.యం. వినోదిని తదితరులు
పాల్గొన్నారు. సమావేశాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడంలో డా.జి.రాజు పాత్ర చాలా ముఖ్యమైంది.
(ఫోటోలు తీసిన వారు యజ్జల ప్రవీణ్ కుమార్ అండ్ చంద్రమౌళి లకు కృతజ్ఞతలతో...)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి