"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

24 జనవరి, 2014

‘‘శ్రీ దాసు శ్రీరాములు గారి జీవితం - సాహిత్యం’’ జాతీయ సదస్సు ( ఫిబ్రవరి, 14)



ఈ ఏడాది ఫిబ్రవరి,14వతేదీన తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం ‘శ్రీ దాసు శ్రీరాములుగారి జీవితం -సాహిత్యం’ అనే అంశంపై ఒకరోజు జాతీయ సదస్సుని నిర్వహించాలని తలపెట్టింది.
శ్రీ దాసు శ్రీరాములుగారు కృష్ణా జిల్లా కూరాడ గ్రామంలో ఏప్రిల్ 8, 1846 సంవత్సరంలో జన్మించి, మే 16, 1908 సంవత్సరంలో మరణించారు. చిన్నతనంలోనే సంస్కృతాంధ్ర భాషలను అభ్యసించి తన పన్నెండవ ఏట నూజివీడు సంస్థానంలో అష్టావధానం చేసి పండితుల ప్రశంసలను అందుకున్నారు. ఇరవై సంవత్సరాల వయసుకే తర్క, వ్యాకరణ, సంగీత, సాహిత్య, వేదాంతాలలో పాండిత్యాన్ని సంపాదిందారు. తరువాత కాలంలో ఆంగ్లాన్ని అభ్యసించి 1878 సంవత్సరంలో ప్లీడరుగా మచిలీపట్నంలో ప్రాక్టీసు ప్రారంభించి, 1884లో ఫస్టు గ్రేడు ప్లీడరుగా పనిచేశారు. తరువాత కాలంలో న్యాయవాదవృత్తిని వదిలి తన జీవితాన్నంతటినీ సాహిత్య సేవకు కేటాయించారు. ఏలూరులో సంగీత నృత్య కళాశాల స్థాపించారు. శ్రీదేవీ భాగవతము, వైశ్యధర్మదీపిక, అభినయ దర్పణము, సంగీత రసతరంగిణి(బౌద్ధనాటకం), మాలతీమాధవము, అచ్చతెలుగు అభిజ్ఞాన శాకుంతలము, ఉత్తర రామ చరితము, ముద్రారాక్షసము, సాత్రాజితీ విలాసము మొదలైన 33 రచనలు చేశారు. 1880లో ‘కల్పవల్లి’ అనే పత్రికను స్థాపించి స్ర్తీపునర్వివాహం, పాశ్చాత్యవిద్యాప్రశంస వంటి సంస్కరణ భావాలకు ఊతమిచ్చారు.  ఈయన రాసిన రచనలగురించి గానీ,  ఇతర రచనలతో తులనాత్మకంగా గానీ పత్రాలు సమర్పించే అవకాశం ఉంది.
శ్రీ దాసు శ్రీరాములుగారి రచనలు, జీవితం పై మీకు నచ్చిన ఒక అంశంపై పత్రసమర్పణ చేయవలసిందిగా కోరుతూ ఈ సదస్సుకి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
మరిన్ని వివరాలకు కింది వారిని సంప్రదించ వచ్చు: 

Prof.S.Saratjyotsna Rani                       
Professor & Head,                             
Department of Telugu                    
Mobile: 9866592115,
2313 3558 (0) 
.................
Dr. Darla VenkateswaraRao   
Seminar Co ordinator, 
Mob: 949312 8049, 2313 3563(0)      
..................
  Dr. D.Vijaya Kumari 
Seminar Co –Co ordinator,   
Mob:  9491877705,  2313 3553 (0)

కామెంట్‌లు లేవు: