రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

నాపరిశోధకులకు, విద్యార్థి సంఘాలకుకృతజ్ఞతలు

పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు 2012 సంవత్సరానికి గాను ‘‘తెలుగు సాహిత్య విమర్శ’’ విభాగంలో నాకు కీర్తి పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా నాదగ్గర పరిశోధన చేస్తున్న పరిశోధక విద్యార్థులు, మా హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు ఎం.ఎస్.ఎఫ్, ఎఎస్ఎఫ్ వారు విశ్వవిద్యాలయం క్యాంపస్ లో పోస్టర్సు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది నా పట్ల మా విద్యార్థులకు, మా విద్యార్థి సంఘాలకు ఉన్న అభిమానానికి నిదర్శనంగా, నాకిచ్చిన గౌరవంగా భావిస్తు, వారికికృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. No comments: