సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాదు మరియు భారతీయ భాషా సంస్థ, మైసూరు వారి ఆధ్వర్యంలో ‘‘తెలుగులో బాలసాహిత్యం- వివిధ ప్రక్రియలు’’ అనే అంశంపై డిసెంబరు 3 - 12, 2012 వర్క్ షాప్ జరుగుతుంది. దీనిలో వివిధ అంశాలపై వ్యాసాలు రాయించి తెలుగు భాలసాహిత్య చరిత్రను తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ గ్రంథాన్ని తర్వాత ఇతరభాషల్లోకి కూడా అనువదిస్తారని నిర్వాహకులు ప్రకటించారు. నేడు అంతర్జాలంలో బాలసాహిత్యం కనిపిస్తోంది. అందువల్ల దీన్ని కూడా ఆ గ్రంథంలో పొందుపరిస్తే బాగుంటుందని నేను సూచించాను. దానికి నిర్వాహకులు అంగీకరించారు. అందువల్ల దీనిలో భాగంగా నేను ‘‘అంతర్జాలంలో పిల్లల పత్రికలు’’ పేరుతో ఒక వ్యాసాన్ని రాస్తున్నాను. ఇప్పటికే అంతర్జాలంలో పిల్లల పత్రికల గురించి మీరేమైనా వెబ్ సైట్ లు గానీ, బ్లాగులు, కమ్యూనిటీ సైట్స్ గానీ నిర్వహిస్తుంటే దయచేసి నా మెయిల్ vrdarla@gmail.com కి తెలపగలరు.
అలాగే అంతర్జాలంలో బాలసాహిత్యంపై ఏమైనా సమీక్షలు, పరిశోధన వ్యాసాలు వస్తే కూడా తెలపగలరు.
మీ
దార్ల
దార్ల
....
డా.దార్ల వెంకటేశ్వరరావు,
అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగు శాఖ,
సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, ఇండియా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి