ప్రజాస్వామ్యం?..!
ప్రపంచానికి ఆధారం పంచభూతాలు, ఆ పంచభూతాలకు ఎన్ని అంగాలో!!?. వాటి సహాయం వాళ్ళ పెరిగే మానవ, ఇతర ప్రాణులకు ఆహారాన్ని, ప్రాణవాయువును అందించే ప్రాణులన్నింటికి అంగాల లోపాలు ఉన్నాయి. ప్రకృతిలో పెరిగే చెట్లకు, వాటికి కొంత స్థలం, డబ్బు అధికారికంగా ప్రభుత్వం కేటాయిస్తుంది. వాటికి ప్రాణహాని కలగిస్తే చట్టరీత్యా శిక్ష కూడా!. ప్రకృతిలో భాగమైన మానవులకు అంగలోపంతో ఉన్నవారికి రాజ్యాంగం, ప్రభుత్వం సమానమైన హక్కులు ప్రజాస్వామ్యమైన మనదేశంలో ఎందుకు కల్పించడం లేదు.
వికలాంగులకు రిజర్వేషన్ పేరిట ఎంతోకొంత విద్యావకాశాలను, ఉద్యగావకాశాలను కల్పిస్తుంది. అందులోను 75% మాత్రమే పూర్తి వికలాంగులకు న్యాయం చేకూరుస్తుంది. దేశంలో ఏవి నిర్ణయించాలన్నా ప్రధానంగా రెండు జ్ఞానేంద్రియాలు అవసరం అవి చట్టసభ, రాజ్యసభ. ఆ ఇంద్రియాలలో డా. బి. ఆర్. అంబేద్కర్ నిరంతరం శ్రమఫలితంగా దళిత, బహుజనులకు వారి ఆత్మగౌరవ హక్కులకు సంబంధించిన విషయాల గురించి 'రిజర్వేషన్' అనే అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం వల్ల పార్లమెంటు, అసెంబ్లీలలో చర్చించగల్గుతున్నారు.
ఆ ఇంద్రియాలలో వికలాంగులకు మాత్రం ఆ ఆయుధపు హక్కు లేదు. ఎందుకు., వారు ఈ దేశప్రజలు కారా?!!. అందుకే వారికి చట్ట,రాజ్యసభల్లోకి ప్రవేశం లేదు కదూ..! దేశంలో సుప్రీంకోర్టులో న్యాయవాదులుగా, జడ్జీలుగా ఉండవచ్చు కాని, పార్లమెంటు, అసెంబ్లీలలో ప్రవేశం ఎందుకు కల్పించొద్దు.
ప్రపంచ వికలాంగుల దినోత్సవం నాడు గొట్టాల ముందు గప్పాలుకొట్టి పత్రికలలో, ఎలక్ట్రానిక్ మీడియాలలో ఫోటోలతో సహా పనికివచ్చే, పనికిరాని సానుభూతి ప్రకటనలు. అందులోను మొట్టమొదటగా "అంగవైకల్యం ఉన్నందుకు మీరు నిరాశ చెందవద్దు. మీకు ప్రభుత్వం బంగారంలాంటి భవిష్యత్తుకి ప్రాతిపదికలు వేస్తుంది" అంటారు. కాని అంగవైకల్యంతో ఉన్నవారికి లోపం అంగమే కాని ఆలోచనాశక్తి కాదు. కనుక వారి జాతికి ఏమి అవసరమో వారే సాధించుకునే అవకాశం పార్లమెంటు, అసెంబ్లీలలో వికలాంగులకు కూడా రిజర్వేషన్ని కచ్చితంగా కల్పించాలి. ప్రభుత్వం సమన్యాయంగా ఆలోచించాలి. ఈ విషయంపై రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు, సంఘాలు ఆలోచించాల్సిన అవసరం నూటికి నూరు శాతం ఉంది.
ప్రజాస్వామ్య దేశంలో "సమానత్వం, సౌభ్రాతుత్వం" అన్న పేర్లతో దేశరాజ్యంగంలో ఉన్నప్పటికిని దేశంలో ప్రజలైన వికలాంగులకు ఎంతమేరకు ప్రజాస్వామిక హక్కులు వర్తిస్తున్నాయో ప్రతీ భారతీయుడు ఆలోచించాలి.
సుమారుగా 25 సంవత్సరాలకు ముందు అమలు చేసినటువంటి 3% రిజర్వేషన్ నేటికీ కూడా అదే పధ్ధతిని అవలంబిస్తుంది ప్రభుత్వం నిజానికి జనాభా లెక్కల ప్రకారం నేడు వికలాంగుల శాతం 7%. ఈ లెక్క ప్రకారం వికలాంగులకి అన్నీ రంగాలలో 7% రిజర్వేషన్ను అమలుపరచాల్సిన అవసరం ఉన్నది. భారత రాజ్యాంగంలో పేర్కొన్న హక్కులు ప్రతి పౌరుడికి వర్తిస్తాయి, ఆ క్రమంలోనే ఉన్నటువంటి 'సమానత్వపు హక్కు' వికలాంగులకు కూడా వర్తిస్తుంది. కావున వికలాంగులకు పంచాయతీ నుంచి మొదలుకొని పార్లమెంటు దాకా రిజర్వేషన్ను భారత ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అమలుపరచాల్సిన అవసరం ఉన్నది.
--చిక్క. హరీష్ కుమార్ (అంధుడు)
జడ్చెర్ల

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి