రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

డా.ద్వానాశాస్త్రిగారి 65వ జన్మదినోత్సవం - ఆయన 50వ రచన ఆవిష్కరణసభ

మా గురువుగారు డా.ద్వానాశాస్త్రిగారి 65వ జన్మదినోత్సవసభను కిన్నెర ఆర్ట్ థియేటర్స్, శ్రీత్యాగరాయగానసభ హైదరాబాదు వారు సంయుక్తంగా ఈ నెల 15వ తేదీన ( 15-6-2012) సాయంత్రం 6 గంటలకు, శ్రీత్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాదులో నిర్వహిస్తున్నారు.

 డా.ద్వానాశాస్త్రిగారు రాసిన 50వ రచన ‘‘నూరు అరుదైన పుస్తకాలు’’(పరిచయవ్యాస సంపుటి) ని ఆవిష్కరిస్తున్నారు.వారి సంపూర్ణ జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దార్ల


No comments: